'బంగార్రాజు' కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ గేయ రచయిత అవతారం ఎత్తారు. ఆయన పెన్ను పట్టారు. ఓ పాట రాశారు. అదీ ప్రత్యేక గీతం కావడం విశేషం. కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా సినిమా 'బంగార్రాజు'. ఇందులో 'వాసివాడి తస్సాదియ్యా...' పాటను దర్శకుడు కల్యాణ్ కృష్ణ రాశారు. 'పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్' పేరుతో ఆదివారం (డిసెంబర్ 19) సాయంత్రం ఆ పాటను విడుదల చేశారు. 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో కలిసి అక్కినేని తండ్రీ తనయులు స్టెప్పులు వేసింది ఈ పాటలోనే!
'ఓయ్... బంగ్గారాజు! నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?' అంటూ మొన్నామధ్య ఓ టీజర్ విడుదల చేశారు కదా! అది ఈ పాటకు సంబంధించినదే. ఇప్పుడు 'వాసివాడి తస్సాదియ్యా' పేరుతో సాంగ్ రిలీజ్ చేశారు. మోహనా భోగరాజు, సాహితీ చాగంటి, హర్షవర్ధన్ చావాలి ఈ పాటను పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లిరికల్ వీడియోలో ఆయన కూడా కనిపించారు. 'నువ్వు శ్రీరాముడివైపోతే బంగార్రాజు... మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు! నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు... మాకెట్టుకో బుద్దవదు బొట్టు గాజు!' అంటూ కల్యాణ్ కృష్ణ పాట రాశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నాగార్జున చెప్పే 'వాసివాడి తస్సాదియ్యా'ను పాటలో కలిపారు. 'వాసివాడి... వాసివాడి... వాసివాడి తస్సాదియ్యా... పిల్లా జోరు అదిరిందయ్యా... దీని స్పీడుకు దండాలయ్యా' అంటూ సాంగ్ హుక్ లైన్ చేశారు.
నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ... నాగ చైతన్యకు జోడీగా కృతీ శెట్టి నటించిన ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.






Vaasivaadi Tassadiyya Song Lyrical Video from Bangarraju Movie:

Also Read: నో ఛేంజ్... 'ఆచార్య' వెనక్కి వెళ్లడం లేదు! మరి, 'భీమ్లా నాయక్' సంగతేంటి?
Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రౌడీ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..
Also Read: మ‌హేష్‌ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో స‌త్తా చాటాడోయ్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి