ప్రభుత్వ  ఉద్యోగులకు అమలు చేసే పీఆర్సీలో ఇప్పటికే ఐఆర్ 27 శాతం అమలు చేస్తుండగా, 14 శాతం ఫిట్మెంట్ సరిపోతుందని అధికారులు  నివేదిక ఇవ్వటం ఏంటని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు  ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై అధికారులు పూర్తిగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకువచ్చి వారికి కూడా అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 


Also Read: ధర్మవరం టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం... టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు


ఉద్యమం తాత్కాలిక వాయిదా


ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఇటీవల నిరసనలు చేపట్టారు. పీఆర్సీపై నివేదిక ఇవ్వాలంటూ సీఎం జగన్‌ సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్‌ కమిటీ తన నివేదికను సీఎంకు సమర్పించారు. సీఎస్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు భేటీ అయ్యారు. అయినప్పటికీ పీఆర్‌సీపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక, మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగ సంఘాల చర్చించిన అంశాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. త్వరలోనే పీఆర్‌సీపై సీఎం జగన్‌ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఉద్యమాన్ని పూర్తిగా విరమించలేదంటున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇచ్చారని, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమం తాత్కాలిక వాయిదా వేశామని అంటున్నారు. 


Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !


ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భేటీ


ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.


Also Read:  మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి