ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తే రాజకీయాలకు దూరం అవుతా అంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధర్మవరం పట్టణంలో జరిగిన టీడీపీ సభలో పాల్గొ్న్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడిన పరిటాల శ్రీరామ్ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి బాటకు ఓటు వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కొంతమంది గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోవడం తనకిష్టం లేదంటూ స్పష్టం చేశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి వారికోసం ఓ పది సెకన్ల సమయం కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 






Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !


చంద్రబాబు అడిగినా ఇదే సమాధానం


ధర్మవరంలో తనకు కాకుండా వేరేవాళ్లకి సీటు ఇస్తే తను రాజకీయాలను విడిచి పెడతానంటూ పరిటాల శ్రీరామ్ అన్నారు. టికెట్ కోసం ప్రయత్నించే వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించినా ఇదే సమాధానం వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి వస్తే కండువా కప్పుతాం, కష్టపడి పని చేస్తే పదవులు ఇస్తాం అంటూ చలోక్తులు విసిరారు. ఇలాంటి ఆసక్తికర ప్రసంగాలు చేస్తూ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు.


Also Read:  మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?


వలంటీర్లకు వార్నింగ్


అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ సూరికి వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో దాక్కున్నా వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తామన్నారు. వలంటీర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్.. టీడీపీ సభలకు వస్తున్న ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 


Also Read: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి