మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే... ఆ తేదీకి సినిమా రావడం లేదని, విడుదల వాయిదా పడిందని సోషల్ మీడియాలి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై టీమ్ స్పందించింది.


"మా 'ఆచార్య' సినిమా విడుదల తేదీ (Aacharya Movie Release Date) మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ సినిమాను విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది. మేం ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా అభిమానులు, అటు ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అంద‌రి అంచ‌నాల‌ను అందుకునే విధంగా, అంచనాలకు తగ్గట్టుగా  సినిమా ఉంటుంది" అని నిర్మాతలు వెల్లడించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌.


సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడిందని, ఆ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని అనుకోవడం... 'ఆచార్య' వెనక్కి వెళ్లిందనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు 'ఆచార్య' నిర్మాతలు ముందుగా ప్రకటించినట్టు తమ సినిమా ఫిబ్రవరి 4న విడుదల అవుతుందని స్పష్టం చేశారు. మరి, 'భీమ్లా నాయక్' సినిమాను నిజంగా వాయిదా వేశారా? లేదంటే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేస్తున్నారా? అనేది చూడాలి.






Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రౌడీ హీరోతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్..
Also Read: మ‌హేష్‌ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో స‌త్తా చాటాడోయ్!
Also Read: సన్నీకి 'ఐలవ్యూ' చెప్పిన అలియాభట్.. పాతిక లక్షలు ఆఫర్ చేసిన నాని..
Also Read: ఉనికి... మహిళా ఐఏఎస్ స్ఫూర్తితో తీసిన సినిమా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి