"సరోససి" అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనడం అనే అనుకుంటాం. ఈ విధానంపై అనేక వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు సినీ తారలు కూడా "సరోగేట్ " వివాదంలో ఇరుక్కుంటున్నారు. అయితే ఇది భిన్నమైన వివాదం. సరోగేట్ అడ్వర్‌టైజింగ్ చేస్తూ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. ఎండార్స్ మెంట్ డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరికి కొంత మంది గౌరవం కోసం వెనక్కి తగ్గుతున్నారు. 


పాన్ మసాలా ప్రకటన నుంచి వైదొలిగిన అమితాబ్ ! 


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించారు. అయితే అది పాన్ మసాలా తరహాలో కనిపించే యాడ్. కానీ కాన్సర్ కారకమైన పాన్ మసాలా ఉత్పత్తిని గుర్తు చేస్తుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ పొగాకు నిర్ములనా సంస్థ కూడా అలాంటి ప్రకటనల్లో నటించవద్దని కోరింది. దీనిపై విస్తృతమైన చర్చ జరగడంతో అమితాబ్ బచ్చన్ కూడా ఆ ప్రకటలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో ప్రకటించారు. సరోగేట్ ప్రకటన కిందకు వస్తుందని తెలిసిన తర్వాత తాను వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 


Also Read : వివాదంలో మహేష్ బాబు.. ఆ ప్రకటనలో నటించడం వల్లే !


సరోగేట్ అడ్వార్‌టైడింగ్ బాట పట్టిన పాన్ మసాలా, గుట్కా, మద్యం కంపెనీలు ! 


కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, గుట్కా, మద్యం ప్రకటనలను నిషేధించింది.  ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు, పత్రిక , టీవీ ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే మొదట్లో కొన్నాళ్లు ఆ కంపెనీలు ప్రకటనలు నిలిపివేశాయి. కానీ తర్వాత డొంక తిరుగుడు పద్దతిలో మార్కెట్లో ప్రకటనలు విడుదల చేయడం ప్రారంభించాయి. ఎలా అంటే.. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంది. రాయల్ చాలెంజర్స్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఆ పేరుతో ప్రకటనలు కూడా వస్తాయి. ఆ ప్రకటనల్లో చివరికి ఓ సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్ చేస్తారు. అలాగే పాన్ మసాలా పేరిట యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇలాచీ, వక్కపొడి అంటూ ప్రకటనలు ఇచ్చి.. బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు అసలు ఉద్దేశం పొగాకు ఉత్పత్తుల ప్రచారమే. దీన్నే సరోగేట్ అడ్వర్ టైజింగ్ అంటారు. బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తు ఇలాంటి ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు.


Also Read : చుక్కలను అందుకునేలా వారిని ప్రోత్సహిద్దాం... కూతురి ఫోటోతో ప్రిన్స్ పోస్టు


మహేష్ బాబు కూడా అలాంటి యాడ్స్‌లో నటిస్తున్నారు..!


టాలీవుడ్‌లో బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేయగలిగే ఇమేజ్ ఉన్న స్టార్ మహేష్ బాబు. ఆయన కూడా ఇటీవల ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించారు.  టైగర్ ష్రాఫ్ కూడా ఓ పాన్ మసాలా ప్రకటన ఇప్పుడు టీవీ చానళ్లలో .. పత్రికల్లో విస్తృతంగా తిరుగుతోంది.ఈ విషయంపై మహేష్ బాబుతో పాటు టైగర్ ష్రాఫ్ పైనా విమర్శలు వచ్చినా వారు పట్టించుకోలేదు. ఆ సంస్థ విస్తృతంగా ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది.


Also Read : మా ఇద్దరి బంధమేంటో చైతుకి తెలుసు.. సమంత స్టయిలిస్ట్ కామెంట్స్..


భారత కంపెనీపై ఫిర్యాదు చేసిన మాజీ జేమ్స్ బాండ్ హీరో !


జేమ్స్ బాండ్ నటుడు అయిన పియర్స్ బ్రాస్నన్‌ను కూడా ఓ భారత పాన్ మసాలాకంపెనీ మోడలింగ్‌కు ఎంచుకుంది. ఆయనతో ప్రకటనలు రూపొందించి  ప్రసారం చేసింది. కానీ ఆయన తాను చేసింది పొగాకు ప్రకటనలకు కాదని.. కానీ సంస్థ తన పేరును.. తన ఇమేజ్‌ను పొగాకు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు వాడుకుంటోందని భారత అధికారులకు బ్రాస్నన్ ఫిర్యాదు చేశారు. ఆయన కూడా మౌత్ ఫ్రెషనర్‌కే మోడలింగ్ చేశారు. కానీ ఆ సంస్థ అమ్మేది మౌత్ ఫ్రెషనర్లు కాదు... పాన్ మసాలాలు. అది తెలిసే పియర్స్ బ్రాస్నన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. 


Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు! 


అన్నీ తెలిసీ సినిమా స్టార్లు ఎందుకు చేస్తున్నారు..? 


తాము  చేసేది సరోగేట్ యాడ్ అని తెలియక కాదు..తెలిసే చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయన్నదే దానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు.  సినిమా స్టార్లు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం వివాదాస్పదమవుతోంది. కొంతమంది స్టార్లు ఎవరేమనుకుంటే మాకేటి..  అనుకుంటూ యాడ్స్ కొనసాగిస్తూండగా కొంత మంది మాత్రం తప్పు చేసిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి