సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓ వ్యాపార ప్రకటన ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. దానికి కారణం  మహేష్ బాబు మోడలింగ్ చేసిన ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి హానికరమన్న నివేదికలు.. ఆరోపణలు ఉండటమే.  మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్ నటించిన పాన్ బహార్ ప్రకటన టీవీల్లో ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. అయితే ఆ ప్రకటన చూసిన వారు మహేష్ బాబు సూపర్ స్టైలిష్‌గా ఉన్నారనో..  మరో కాంప్లిమెంటో ఇవ్వడం లేదు. అలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎందుకటే పాన్ బహార్ అనేది ఓ పాన్ మసాలా. పొగాకు ఉత్పత్తి. అలాంటి ఉత్పత్తుల వల్ల దేశంలో క్యాన్సర్ బారిన పడి ఏటా లక్షల మంది చనిపోతున్నారు. Also Read : ముంబైకి మకాం మారుస్తున్న సమంత



ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న కొంత మంది నెటిజన్లు అలాంటి వ్యాపార ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏమిటంటున్నారు. అయితే మహేష్ బాబు పాన్ మసాలా యాడ్‌లో నటించలేదు. పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ యాడ్‌లో మాత్రమే నటించారు. ఈ విషయం ఆ యాడ్ చూసిన వారికీ అర్థం కాదు. అదే మార్కెటింగ్ స్ట్రాటజీ, దేశంలో  మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్ని నిషేధించారు. అందుకని ఆయన కంపెనీలు  మద్యం, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్లతో వేరే ఉత్పత్తుల్ని అమ్ముతున్నట్లుగా నమ్మిస్తూ ప్రకటనలు రూపొందిస్తున్నారు. వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ చూసే వారికి అవి మద్యం, పొగాకు ప్రకటనలే అని సులువుగా తెలిసిపోతాయి. మహేష్ బాబు నటించిన పాన్ బహార్ వ్యాపార ప్రకటన కూడా అలాంటిదే. పాన్ బహార్ పాన్ మసాలా అమ్మకాల్లో ప్రసిద్ధి చెందింది.Also Read : ఆ ఓటీటీకి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్


గతంలో ఈ సంస్థ జేమ్స్ బాండ్ నటుడు అయిన పియర్స్ బ్రాస్నన్‌ను కూడా మోడలింగ్‌కు ఎంచుకుంది. ఆయనతో ప్రకటనలు రూపొందించి  ప్రసారం చేసింది. కానీ ఆయన తాను చేసింది పొగాకు ప్రకటనలకు కాదని.. కానీ పాన్ బహార్ సంస్థ తన పేరును.. తన ఇమేజ్‌ను పొగాకు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు వాడుకుంటోందని భారత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా మౌత్ ఫ్రెషనర్‌కే మోడలింగ్ చేశారు. కానీ ఆ సంస్థ అమ్మేది మౌత్ ఫ్రెషనర్లు కాదు... పాన్ మసాలాలు. అది తెలిసే పియర్స్ బ్రాస్నన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. Also Read : రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ చేసిన బన్నీ


అయితే ఇప్పుడు మహేష్ బాబు మాత్రం ఏ మాత్రం మొహమాట పడకుండా ఇలాంటి యాడ్స్‌లో నటించండానికి అంగీకరించడం వివాదాస్పదమవుతోంది. అత్యంత లగ్జరీగా చిత్రీకరించిన యాడ్ పై వస్తున్న విమర్శలపై మహేష్ బాబు టీం స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ.. చర్చ ప్రారంభమైంది. ఇలాంటి ప్రకటనలు చేయడం అవసరమా అన్నదే ఎక్కువ మంది ఒపీనియన్. Also Read : జర్నలిస్ట్‌తో హరీష్ శంకర్ ట్వీట్ వార్