మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ధృవ, రంగస్థలం సినిమాలతో అప్పటి వరకూ ప్రేక్షకులకు తెలియని చెర్రీని చూపించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం RC 15 మూవీతో తనని తాన పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకుంటున్నాడు. అటు ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా దూసకుపోతున్నాడు. ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ తెలుగు వెర్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు తెలుస్తోంది. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్‌ యాడ్స్‌లో చేసేందుకు రామ్‌ చరణ్‌ రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసినట్లు టాక్‌.


ఇప్పటికే అల్లువారి వారసుడు ‘ఆహా’ అంటూ డిజిటల్ ప్లాట్ ఫాంతో ఓ వైపు, థియేటర్ చైన్ బిజినెస్ మరోవైపు, పబ్ ఇంకోవైపు అబ్బో చాలా బిజీగా ఉన్నాడు. అటు మహేశ్ బాబు ఏషియన్ సినిమాస్ తో టై అప్ అయ్యాడు. చెర్రీ కూడా ఇదివరకే చిన్న నగరాలకు ప్రయాణించే జెట్ విమానాల బిజినెస్ లో పెట్టుబడులు పెట్టాడని అన్నారు. ఇప్పుడు తాజాగా గతంలో కన్నా భిన్నంగా కొంత డీల్ కి ఓకే చెప్పాడు చరణ్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ బ్రాండ్ అంబాసిడర్ గా చేరడానికి మెగా హీరో రామ్ చరణ్ సంసిద్ధంగా ఉన్నాడని టాక్. చెర్రీతో ఇప్పటికే సదరు సంస్థ డీల్ మాట్లాడుతోందట. ఓ రెండు వీడియో ప్రకటనలు  ప్రింట్ యాడ్స్ లో చరణ్ నటించేందుకు రూ.3కోట్ల మేర పారితోషికం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటోందని సమాచారం. చెర్రీ బరిలో దిగడమే నిజమైతే  అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహాలకు ధీటుగా తెలుగులోనూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఇమేజ్ అమాంతం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..


అమెజాన్ ప్రైమ్ కి ధీటుగా నెట్ ఫ్లిక్స్ ఎదుగుతోంది. మరోవైపు వాటికి ధీటుగా తెలుగు కంటెంట్ అందిస్తూ ‘ఆహా’ కూడా ఆహా అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చెర్రీతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పందం కుదుర్చుకోవడం వారికి కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. మెగా అభిమానులు ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పైనా దృష్టి సారిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. చెర్రీ తమ డీల్ ని అంగీకరిచండపై డిస్నీప్లల్ హాట్‌స్టార్‌ ఆనందం వ్యకం చేస్తోందట. 


Also read: ‘లవ్ స్టోరీ’ ట్రైలర్: బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవను జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడట.. డైలాగ్స్ భలే ఉన్నాయ్!


Also Read: నేను పడిన బాధ ఎవ్వరు పడొద్దనే ఆ సంస్థను స్థాపించా