Delhi Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. సహాయక చర్యలు ముమ్మరం

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 13 Sep 2021 04:36 PM (IST)

దిల్లీలో ఓ భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం.

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. సహాయక చర్యలు ముమ్మరం

NEXT PREV

దిల్లీ మల్కాగంజ్ లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికులు సహా సహాయకబృందాలు శిథిలాలను తొలగిస్తున్నారు. చిన్నారులతో సహా చాలా కుటుంబాలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement






ఎంతమంది చిక్కుకున్నారో సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. భవనం వద్ద ఉన్న చాలా ఆటోరిక్షాలు డ్యామేజ్ అయ్యాయి.







స్థానిక పోలీసులు, ఎమ్ సీడీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో చెప్పాలంటే ఇంకాస్త సమయం కావాలి.                                - ఎన్ఎస్ బుందేలా, దిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్






ఇప్పటివరకు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గుర్ని కాపాడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

Published at: 13 Sep 2021 01:10 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.