శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ ఈనెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్న టీమ్తా జాగా 'లవ్ స్టోరీ' చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.


లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే జుంబా డ్యాన్సర్ రేవంత్‌గా నాగచైతన్యను చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. మరోవైపు అత్తెసరు మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి పల్లవి కనిపిస్తోంది.  మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ ప్రతిభను గుర్తించిన రేవంత్.. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు. వీరిద్దరి ప్రేమకు కులాలు, ఆస్తులు అడ్డుపడుతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.


ఓవరాల్ గా ‘ఫిదా’ తర్వాత అందమైన ప్రేమకథను శేఖర్ కమ్ముల తెరక్కించాడని అర్థమవుతోంది. ‘ఫిదా’ లా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సెట్ చేసిన ఈ లవ్ స్టోరీలో నాగచైతన్య - సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. 'బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవాని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడు.. ‘‘మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా?', 'బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం'’ ఈ డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. 'లవ్ స్టోరీ' లో రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు  ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, 'సారంగ దరియా' 'ఈ చిత్రం చూడు' పాటలు సంగీత ప్రియులను అలరించాయి.


‘లవ్ స్టోరీ’ ట్రైలర్: 


 



also Read: అనుకున్నంతలోనే సీఎంల మార్పు ! బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..? బలమైన నేతల్ని ఎదగనీయకపోవడం కారణమా...?


 


Also Read: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం... ఇవాళ దిల్లీలో కేంద్రజల్‌శక్తి కార్యదర్శితో భేటీ... గెజిట్ అమలుపై చర్చ


Also Read: టీ 20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్ల ఫార్మట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..


Also read: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌