ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా స్టార్ హీరో మహేష్ బాబు తన కూతురి ఫోటోతో పాటూ క్యాప్షన్ జత చేర్చి ట్విట్టర్ పోస్టు పెట్టారు. సితార చక్కటి నవ్వుతో ఓ నది ముందు సేదతీరుతున్న ఫోటోను పోస్టు చేసి ‘నా కూతురితో పాటూ, ప్రపంచంలోని ఆడపిల్లలంతా ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. వారు చుక్కలను అందుకునేలా శక్తివంతంగా మారేందుకు సహకరిద్దాం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను పద్దెనిమిది వేల మందికి పైగా లైక్ చేశారు. మూడున్నర వేలకు పైగా రీట్వీట్ చేశారు. 


మరొక పోస్టులో తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు మహేష్ బాబు. తన పిల్లలతో కలిసి ప్రశాంతతను వెతుకుతున్నానంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో భాగంగా స్పెయిన్ లో ఉన్నారు. ఈ షూటింగ్ గ్యాప్ లో భార్యా పిల్లలతో కలిసి స్విట్లర్లాండ్ ట్రిప్ కు వెళ్లారు. ఫ్యామిలీ గడపడం మహేష్ కు చాలా ఇష్టమైన వ్యాపకం. సమయం దొరికితే వారితో ఎక్కడో దగ్గరికి షికార్లు వెళ్లడానికే ఆసక్తి చూపుతారు. 


సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునే కొడుకుగా ఇందులో మహేష్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయిట. గతంలో షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. వాటి ద్వారా సర్కారు వారి పాటలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు తెలిసిపోయింది. 



Also read: International Day of the Girl Child: ఆడపిల్లయితేనేం... ఏం తక్కువ?


Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?


Also read: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి


Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి