సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ తో ఎగ్జిబిటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ఐదవ ఆట ప్రదర్శనకు అనుమతులు మంజూరు, లాక్ డౌన్ సమయంలో థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులను రద్దు చేయడం.. ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని విషయాలను వెల్లడించారు. 


ఐదవ ఆటను ప్రదర్శించడానికి.. ఆన్ లైన్ టికెట్స్, టాక్స్, కరెంట్ బిల్లులు ఈ అంశాలపై సమావేశంలో చర్చించామని.. ఇప్పటికే షూటింగ్ లకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ను సినిమా హబ్ గా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని.. ఈ సమావేశంలో జరిగిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.


అలానే మరో సమావేశం తరువాత వాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాల క్లారిటీ వస్తుందని అన్నారు. అలానే ఐదవ షోకు సంబంధించిన అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో కరెంట్ చార్జీల మాఫీపై చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు.
థియేటర్ల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరామని.. దానికి ప్రభుత్వం అంగీకరించిందని.. మిగతా సమస్యలపై కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని ఎగ్జిబిటర్ సి.కళ్యాణ్ తెలిపారు. 


ఇదిలా ఉండగా ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ చార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మురళి మోహన్‌, కార్యదర్శి సునీల్‌ నారంగ, సినీ ఎగ్జిబిటర్స్‌ సదానంద్‌ గౌడ్‌, అభిషేక్‌, అనుపమ్‌ రెడ్డి తదితరులు మంత్రిని కలిసి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. 


Also Read : Breaking : షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాలు.. సర్జరీ కోసం హైదరాబాద్ కు..


Lucifer Remake : మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్.. సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటారా..?


Allu Arha : 'శాకుంతలం' స్పెషల్ పార్టీ.. అర్హతో బన్నీ ఫోటోలు వైరల్