Allu Arha : 'శాకుంతలం' స్పెషల్ పార్టీ.. అర్హతో బన్నీ ఫోటోలు వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ 'శాకుంతలం' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న ఈ సినిమాతో అల్లు అర్హ సినీ రంగప్రవేశం చేయనుంది.
ఇందులో ఆమె భరతుడిగా కనిపించబోతుంది. ఇప్పటికే ఆమెకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేశారు దర్శకుడు.
ఆమెకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం గ్రాండ్ గా సెండ్ ఆఫ్ పార్టీ ఎరేంజ్ చేసింది.
ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో అల్లు అర్జున్, అల్లు స్నేహా కూడా ఉన్నారు. తమ కూతురిని చూసుకొని మురిసిపోతుంది ఈ జంట.
అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే 'శాకుంతలం' షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో బన్నీ తన కూతురు సెట్ కు వెళ్లారు.
మరో పదిహేను, ఇరవై ఏళ్ల తరువాత ఇలాంటి సందర్భం వస్తుందని అనుకున్నానని.. కానీ ముందే ఇలాంటి రోజు వచ్చిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.