Vijay Sethupathi In Sharwanand Film : శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమైన, ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' సినిమాలు తీసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) తీస్తున్న చిత్రమిది. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే... 


శర్వానంద్ తండ్రిగా విజయ్ సేతుపతి!?
శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమాలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన విజయ్ సేతుపతి నటిస్తున్నారట. ఆయనది హీరోకి తండ్రి పాత్ర అని టాక్. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే?


హీరో శర్వానంద్ 35వ చిత్రమిది. ఇందులో ఆయనకు జోడీగా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, కృతి శెట్టి అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తు వచ్చే సినిమా 'ఉప్పెన'. అందులో వాళ్ళిద్దరూ తండ్రి కుమార్తెలుగా నటించారు. ఇప్పుడీ సినిమాలో శర్వాకు విజయ్ సేతుపతి తండ్రి అంటే... కృతి శెట్టికి మామ అవుతారు అన్నమాట. భలే ఉంది కదూ ఈ కాంబినేషన్! ఈ రిలేషన్స్ మీద శ్రీరామ్ ఆదిత్య మంచి ఫన్నీ సీన్స్ ఏమైనా తీస్తారేమో చూడాలి! 


Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?


బేబీ ఆన్ బోర్డ్ - టైటిల్ అదేనా?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఆల్రెడీ టైటిల్ ఖరారు చేశారని టాక్. 'BOB' (Baby On Board) టైటిల్ లాక్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 


Also Read 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?



'బేబీ ఆన్ బోర్డ్' క్యాప్షన్ ఎక్కువగా కార్ల మీద కనపడుతుంది. కారులో చిన్న పిల్లలు... అంటే జన్మించి కొన్ని నెలలు మాత్రమే అయిన చిన్నారులు కారులో ఉన్నారని రోడ్డు మీద మిగతా వాళ్ళకు సమాచారం ఇవ్వడం కోసం ఆ క్యాప్షన్ పెడతారు. మరి, ఈ సినిమాకు 'బేబీ ఆన్ బోర్డ్' టైటిల్ పరిశీలించడం వెనుక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాన్సెప్ట్ ఏమిటో? లండన్‌ నేపథ్యంలో 'బేబీ ఆన్ బోర్డ్' కథ సాగుతుందని తెలుస్తోంది.


శ్వరా 35కు 'ఖుషి' సంగీత దర్శకుడు
ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ 'హృదయం'తో తెలుగు ప్రేక్షకులు కొందరిని ఆయన ఆకట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. నాని 'హాయ్ నాన్న', విక్రాంత్ 'స్పార్క్' సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. 
 
'BOB Baby On Board' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కృతి ప్రసాద్ & ఫణి కె వర్మ, కళా దర్శకుడు : జానీ షేక్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : విష్ణు శర్మ,  సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial