మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ (Varun Tej Remuneration) ఎంత? ఆయన ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు? సాధారణంగా తీసుకునే ఆయన గానీ, ఇచ్చే నిర్మాతలు గానీ ఎప్పుడూ బయటకు చెప్పింది లేదు. అయితే... వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా 'గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). ఈ సినిమాకు హీరోతో పాటు దర్శకుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) పూర్తిగా డబ్బులు తీసుకోలేదు. ఇద్దరూ హాఫ్ హాఫ్ రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారు. ప్రవీణ్ సత్తారును ఈ విషయం గురించి ఏబీపీ దేశం అడగ్గా... 


అవును... బ్రేక్‌ ఈవెన్‌ అయ్యాక ఇవ్వమని చెప్పాం!
''సాధారణంగా సినిమా విడుదలకు ఒకట్రెండు రోజుల ముందు రెమ్యూనరేషన్స్ సెటిల్ చేయడం జరుగుతుంది. అంటే... భారీ రెమ్యూనరేషన్స్ ఎవరివి అయితే ఉంటాయో వాళ్ళవి! అగ్ర కథానాయకులు అందరూ అలాగే తీసుకుంటారు. బయట ఎవరెవరో ఏవో అనుకుంటారు. రెమ్యూనరేషన్ అంతా తీసేసుకున్నారని! అది కరెక్ట్ కాదు. 'గాండీవదారి అర్జున' విషయానికి వస్తే... నేను గానీ, వరుణ్ తేజ్ గానీ మా నిర్మాత బాపినీడుతో ఒక్కటే చెప్పాం... 'నీకు లాభాలు రావడం ముఖ్యం. మీకు బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ ఇవ్వు' అని! మా మధ్య మంచి అనుబంధం ఉంది. నిర్మాతపై ఒత్తిడి తీసుకు రావాలని మేం అనుకోలేదు'' అని ప్రవీణ్ సత్తారు వివరించారు. (Praveen Sattaru Gandeevadhari Arjuna Interview)


Also Read : వరుణ్ తేజ్ ఫోన్ తీసుకుని పేరు మార్చిన లావణ్య త్రిపాఠి - లవ్ కాదు, లావ్!



'గాండీవధారి అర్జున' బడ్జెట్ రూ. 40 కోట్లే!
Gandeevadhari Arjuna Budget : 'గాండీవధారి అర్జున' చిత్రీకరణకు తొలుత 72 రోజులు అవసరం అవుతాయని ప్రవీణ్ సత్తారు షెడ్యూల్స్ వేశారు. అయితే... నిర్మాతకు చెప్పిన బడ్జెట్ కంటే తక్కువలో ఫినిష్ చేశారు. హీరో వరుణ్ తేజ్ సహకారం, పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల 54 రోజుల్లో సినిమా అంతా పూర్తి చేశారు. సినిమా నిర్మాణ వ్యయం కూడా 40 కోట్ల రూపాయలే. 


Also Read అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్


సెన్సార్ పూర్తి... రన్ టైమ్ ఎంతంటే?
'గాండీవధారి అర్జున' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమాకు వెళ్ళవచ్చు. ఇక, రన్ టైమ్ విషయానికి వస్తే... 2.18 గంటలు. స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గాప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కించారు. 


వరుణ్ తేజ్ జోడీగా 'ఏజెంట్' ఫేమ్, యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ నిర్మిస్తున్నారు. నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, 'బేబీ' వేద ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు : అవినాష్ కొల్ల, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, యాక్షన్ కొరియోగ్రఫీ : లాజ్లో - వెంకట్ - విజయ్ - జుజి, ఛాయాగ్రహణం : ముఖేష్ జి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial