టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'DJ టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' వస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ని అందుకుంది. ఈసారి సిద్దుతో అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేయబోతోంది. ఆ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇప్పటికే కొన్ని పోస్టర్స్ ద్వారా మూవీ టీం చెప్పకనే చెప్పారు. దీంతో 'టిల్లు స్క్వేర్' కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక  ఆ ఆసక్తిని మరింత పెంచుతూ టిల్లు స్క్వేర్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.


అది ఏంటంటే, ఈ సినిమాలో రాధిక.. అదే హీరోయిన్ నేహా శెట్టి టిల్లు కి అంటే సిద్దు కి ఓ షాక్ ఇవ్వబోతుందట. డీజే టిల్లులో రాధిక పాత్రలో నేహా శెట్టి ఓ రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ తన నటనతోనూ అదరగొట్టేసింది. ముఖ్యంగా సినిమాలో టిల్లు కి రాధిక హ్యాండ్ ఇచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ తర్వాత క్లైమాక్స్ లో రాధికకి టిల్లు ఇచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. అయితే ఇప్పుడు 'టిల్లు స్క్వేర్'లో మరోసారి టిల్లుకు రాధిక ట్విస్ట్ ఇవ్వబోతుందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. 'టిల్లు స్క్వేర్' లో నేహా శెట్టి ఓ క్యామియో రోల్ చేస్తోందట. ఇందుకోసం మూవీ టీం నేహాను సంప్రదించగా ఆమె ఓకే చెప్పడం, రీసెంట్గా తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసిందట.


క్లైమాక్స్ లో నేహా శెట్టి ఎంట్రీ ఉండబోతుందట. ఆడియన్స్ కి నేహా శెట్టి ఎంట్రీ చాలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారట మూవీ టీం. అంతేకాకుండా ఆమె ఎంట్రీ తోనే క్లైమాక్స్ మలుపు తిరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో డీజే టిల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బహుశా ఇందులో రాధిక ఎంట్రీతో పార్ట్ 3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో? అంటూ పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'టిల్లు స్క్వేర్' లో నేహా శెట్టి గెస్ట్ అపీరియన్స్ ఉండబోతుందనే వార్త బయటికి రావడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


ఇక నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. యంగ్ హీరో కార్తికేయకి జోడిగా ఈ అమ్మడు నటించిన 'బెదురులంక 2012' ఆగస్టు 25న విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు 'రూల్స్ రంజాన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇక 'టిల్లు స్క్వేర్' సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిర్యాల సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది.


Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial