Sakshi Vaidya - Pawan Kalyan : అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్

పవన్ కళ్యాణ్ సినిమాలో తాను నటించనున్నట్లు యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య కన్ఫర్మ్ చేశారు.

Continues below advertisement

బ్యాక్ టు బ్యాక్... మెగా ఫ్యామిలీలో ముగ్గురు కథానాయకులతో నటించే అవకాశం అందుకున్న భామగా కొత్త కథానాయిక సాక్షి వైద్య (Sakshi Vaidya) పేరు వార్తల్లో నిలుస్తోంది. ఇంతకీ, ఆమె ఎవరు? అనుకుంటున్నారా!? అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'ఏజెంట్'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఉత్తరాది అమ్మాయి. ఆ సినిమా విడుదలకు ముందు మూడు సినిమాలకు సంతకం చేశారు. ఆ మూడు సినిమాల్లో హీరోలు మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కావడం విశేషం. 

Continues below advertisement

అవును... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా 'గాంఢీవధారి అర్జున'. అందులో సాక్షి వైద్య కథానాయికగా చేశారు. ఆ సినిమా చిత్రీకరణలో ఉండగా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. 

'గాంఢీవధారి అర్జున' సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు సాక్షి వైద్య. అప్పుడు ఆమెను ''ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ ప్రారంభించారా?'' అని అడగ్గా... ''ఇంకా లేదు. త్వరలో ప్రారంభం అవుతుంది'' అని ఠక్కున చెప్పేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా కన్ఫర్మ్ చేశారు.

Also Read : ప్రభాస్ వీడియో లీక్ చేసేశారే - మెగాస్టార్ బర్త్‌డేకు చిరు లీక్స్ స్ఫూర్తితో!

'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీ లీలతో పాటు సాక్షి!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). ఈ సినిమాలో ఓ కథానాయికగా శ్రీ లీల నటిస్తున్నారు. మరో నాయిక అవకాశం సాక్షి వైద్య చెంతకు చేరింది. కొన్ని రోజుల క్రితం ఆమెపై ఫొటోషూట్ చేశారు. ఆ తర్వాత పాత్రకు ఆమె సూట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. 

Sakshi Vaidya Upcoming Movies : సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. దాంతో జయంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'విరూపాక్ష' విజయం తర్వాత మరోసారి హీరో, నిర్మాతలు కలిసి సినిమా చేస్తున్నారు. 'విరూపాక్ష' విడుదల కంటే ముందు సినిమాను ప్రారంభించారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 

Also Read 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?

'ఏజెంట్' విడుదలైన తర్వాత ఆ సినిమా హీరో అఖిల్ అక్కినేని నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. ఆ రిజల్ట్ ఆయన్ను బాగా డిజప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు. అయితే... ఆ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సాక్షి వైద్య మాత్రం వెంటనే మూడు సినిమాల్లో ఛాన్సులు సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్... ఇప్పుడు సాక్షి వైద్య చేతిలో ఉన్న మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola