రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వీడియో ఒకటి లీక్ అయ్యింది. అదీ ఆయన హీరోగా రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD movie) నుంచి! అయితే, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆ వీడియోను లీక్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కనుక! 


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా...
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) సందర్భంగా ఆయనకు వైజయంతి మూవీస్ శుభాకాంక్షలు చెప్పింది. అది కూడా 'కల్కి'లో ప్రభాస్ వీడియో విడుదల చేసి! ప్రభాస్ విజువల్స్ ప్లే అవుతుంటే... వెనుక 'గ్యాంగ్ లీడర్' సాంగ్ మ్యూజిక్ ప్లే అయ్యింది. వీడియోలో ప్రభాస్ కూడా చిరంజీవిలా కనిపించారు. 


Also Read 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?






సంక్రాంతికి రావడం సందేహమే!
'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2989 ఏడీ'. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా... ఇప్పుడు ఆ తేదీకి రావడం సందేహమే.  


'ప్రాజెక్ట్ కె' అంటే... 'కల్కి'
'ప్రాజెక్ట్ కె' అంటే ఏమిటి? కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. కల్కి... కలియుగ్... కాల్ చక్ర... కురుక్షేత్ర... 'కె' మీనింగ్ ఇదేనంటూ చాలా టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు 'కె' అంటే ఏమిటి? అని డౌట్స్ అవసరం లేదు. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కల్కి' అని చెప్పేశారు. 


Also Read శంకర్ ఎప్పుడు చెబితే అప్పుడు - చేతులు ఎత్తేసిన 'దిల్' రాజు



'కల్కి' గ్లింప్స్ విషయానికి వస్తే... సినిమా భారీతనం చూపించారు. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్ లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్ (Prabhas Role In Kalki)ను చూపించారు. కథలో టైమ్ ట్రావెల్ గురించి హింట్ ఇచ్చారు. దీపికా పదుకోన్ సీన్లు కూడా చూపించారు. 


'కల్కి 2989 ఏడీ' సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు నుంచి 'ఇదొక పాన్ వరల్డ్ మూవీ' అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. సూపర్ హీరో పాత్రను రెబల్ స్టార్ చేస్తున్నారని అర్థమైంది. అయితే... ఆ లుక్ మాత్రం అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించలేదు. విమర్శలు వచ్చాయి. 'కల్కి' గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 


'కల్కి'లో ఎవరెవరు ఉన్నారు?
Kalki 2898 AD movie cast and crew : 'కల్కి'లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో 'లోఫర్', హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial