Megastar B'day: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సినీ నటుడు శ్రీకాంత్ మేక పాల్గొన్నాడు. సినిమాల్లోకి రావడానికి మెగాస్టారే స్ఫూర్తి అని ఎప్పుడూ చెప్పే శ్రీకాంత్.. ఈ వేదికపైనా ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఆయనను రోల్ మోడల్ గా తీసుకుని ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారని, ఆయనొక ఫ్యామిలీ మ్యాన్ (Family Man) అని చిరంజీవి గురించి శ్రీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


"ఆగస్టు 22 వచ్చిందంటే చాలు.. ఇంట్లో వాళ్లకే కాదు ఫ్యాన్స్ అందరిలోనూ ఓ పండగ వాతావరణ నెలకొంటుందని అందరికీ తెలిసిందే. ప్రతీ సంవత్సరం ఇలా మెగాస్టార్(Megastar) పుట్టినరోజును ఒక పండగలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేనే కాదు నాలా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్లు కూడా ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుని వచ్చినవారే. తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్లు భార్యాపిల్లల్ని ప్రేమిస్తారు. అలాగే తోబుట్టువులను ప్రేమిస్తారు. వాళ్లందరినీ ప్రేమించేవారు ఖచ్చితంగా అభిమానుల్ని కూడా ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తి మన అన్నయ్య. అభిమానుల్ని కూడా ఓ తమ్ముడిగా ట్రీట్ చేసే గుణం ఆయనకుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేనొక అభిమానిగా ఆయన్ని ఫస్ట్ కలిసి.. నేను మీ అభిమానిని అని అన్నపుడు.. ఆయన అభిమానిలా కాకుండా ఓ తమ్ముడిలా అక్కున చేర్చుకున్నారు. ఆయన సినిమాలు చూసి నేను కూడా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే ఆయన ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో మాటల్లో చెప్పలేం. ఆ విషయంలోనూ ఆయన రోల్ మోడల్ గానే ఉంటారు" అని శ్రీకాంత్ చెప్పారు.


"కరోనా సమయంలోనూ తన సామాజిక సేవలతో ఎంతో మంది సాయం చేశారు. నేను హీరో అయినా ఇప్పుటికీ నేను ఆయన అభిమానినే. డబ్బులుండొచ్చు. కానీ కష్టాన్ని నమ్ముకున్నోడు ఎప్పటికైనా సక్సెస్ అవుతారని మెగాస్టార్ ను చూసి ఆయన ఫ్యామీలీ నుంచి వచ్చిన నటులు కూడా నేర్చుకున్నారు. ఈ రోజు నేను ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది" అని శ్రీకాంత్ అన్నారు. 


ఇక శ్రీకాంత్ (Srikanth) సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన ఆయన.. ఇటీవలి కాలంలో పలు పాత్రలు పోషిస్తూ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న'కోట బొమ్మాళి .. పీఎస్ (Kotabommali PS)' అని సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 నుంచి రాబోతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గతంలో జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. 


Read Also : Vennela Kishore: వెన్నెల కిషోర్ హీరోగా ‘చారీ 111’ - బుర్రలేని స్పైగా నవ్విస్తాడట, ఇదిగో ప్రోమో!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial