వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  రెండు భాగాలుగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో తొలి భాగానికి ‘వ్యూహం’ అనే పేరు పెట్టారు. రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండూ ఏపీ పాలిటిక్స్ లో పెను దుమారం రేపాయి. రెండింటిలోనూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను వర్మ ఓ రేంజిలో టార్గెట్ చేశారు.


‘వ్యూహం’ మూవీలో షర్మిల ఫోటో లీక్


ఇప్పటికే ‘వ్యూహం’ సినిమాలోని పలు పాత్రలకు సంబంధించిన ఫోటోలు విడుదల అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో వైఎస్ షర్మిలకు సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోల్లో షర్మిల వైసీపీ కండువా మెడలో వేసుకుని కనిపించింది. ఆమె వెనుకే వైఎస్ భారతి కనిపించింది. ఒక ఫోటోలో షర్మిల భుజంపై భారతి తలపెట్టి ఉండగా,  మరో ఫోటోలో ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో షర్మిల పాత్రను నటి రేఖ నిరోష చేస్తున్నారు.


ఏపీలో దుమారం రేపిన ‘వ్యూహం’ టీజర్లు


‘వ్యూహం’ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించాయి. తొలి టీజర్ లో జగన్ అరెస్టు, కొత్త పార్టీ ఏర్పాటు సహా పలు అంశాలను చూపించారు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైనఈ టీజర్ లో,  వైఎస్సార్ మరణం తర్వాత ఏం జరిగింది? ఎవరి రియాక్షన్ ఏంటి? జగన్ ను కొనడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రావడం, అందుకు తను ఒప్పుకోకపోవడంతో అరెస్టు చేయడం, ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడం లాంటివి చూపించారు. “నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా?” అనే జగన్ డైలాగ్ ఫస్ట్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.  ఆగష్టు 15న  ‘వ్యూహం’ మూవీకి సంబంధించిన రెండో టీజర్ విడుదల అయ్యింది. ఇందులో నాటి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు చూపించే ప్రయత్నం చేశారు ఆర్జీవీ.


జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి,  సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్ సహా పలువురి పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే, అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది” అంటూ జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇక టీజర్ చివర్లో చంద్రబాబు పవన్ మీద వేసే సటైర్ అందరినీ షాక్ కి గురి చేసింది.  “ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా?” అని చంద్రబాబుని అడగ్గా, “వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్ను పోటు పొడుచుకుంటాడు” అని చెప్పే డైలాగ్ సంచలనం కలిగిస్తోంది. ‘వ్యూహం’ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతిగా మానస నటిస్తున్నారు.  


Read Also: ఆ హీరోయిన్ బౌలింగ్ స్కిల్స్‌ కు సచిన్ టెండూల్కర్ ఫిదా, వీడియో చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial