ఫాంటసీ జానర్‌లో చిరంజీవి సినిమా - మెగా అప్డేట్ వచ్చేసిందోచ్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు ఓ గుడ్ న్యూస్! ఆయన హీరోగా ఓ ఫాంటసీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ, దాని తర్వాత చేస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి సినీ ప్రయాణంలో ఇది భారీ బడ్జెట్ సినిమా అవుతుందని చెబుతున్నారు. మెగాస్టార్ 157వ సినిమా ఇది. సో... #Mega157 వర్కింగ్ టైటిల్ తో వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘జవాన్’కు సీక్వెల్ ప్లాన్? కథ కూడా అదేనట - షారుఖ్ ఆసక్తికర ట్వీట్
ఈమధ్యకాలంలో సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ సక్సెస్ రేసులో దూసుకుపోతున్నారు. వారి ఇమేజ్‌కు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్న సీనియర్ హీరోలను సక్సెస్ వరిస్తోంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూడా అదే చేశారు. తమిళంలో కనీసం అరడజను సినిమాల అనుభవం కూడా లేని అట్లీకి బాలీవుడ్ బాద్‌షా.. ఒక అవకాశం ఇచ్చి చూశారు. అంతే ఆ అవకాశాన్ని 200 శాతం వినియోగించుకున్నాడు అట్లీ. షారుఖ్‌తో కలిసి సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌లో ఒక యాక్షన్ మూవీ రెడీ చేశారు. అదే ‘జవాన్’. ఇప్పుడు ఆ మూవీ కేవలం బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇదే సమయంలో షారుఖ్ చేసిన ఒక ట్వీట్.. నెటిజన్లను ఆకర్షిస్తోంది. షారుఖ్ చెప్పినదాన్నిబట్టి చూస్తే ‘జవాన్’కు సీక్వెల్ ఉండబోతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యానే - ఎవరిని కలిసినా అదే ప్రశ్న అంటూ...
‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఇండియన్ మాత్రమే కాదు... గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు సినిమాను ఏ స్థాయిలో నిలబెట్టాలో... ఆ స్థాయిలో నిలబెట్టి ప్రతీ ప్రేక్షకుడిని గర్వపడేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు... రాజకీయ నాయకులు, క్రీడాకారులు.. ఇలా అందరి చేత ‘ఆర్ఆర్ఆర్’ ప్రశంసలు పొందింది. తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ గురించి తన భావాలను బయటపెట్టడం మరోసారి తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'దేవర'. ప్రస్తుతం చిత్రీకరణలో జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మహాశివునిగా ప్రభాస్ - ఇది కదా క్రేజీ న్యూస్ అంటే!
'ఆదిపురుష్' చిత్రంలో మర్యాదా పురుషోత్తముడు శ్రీరామ చంద్రుని పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న పాన్ వరల్డ్ సినిమా 'కల్కి 2898 ఏడీ'లో శ్రీ మహా విష్ణువు పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. మరోసారి వెండితెరపై భగవంతుని పాత్రలో కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి మహా శివుని పాత్రలో కనిపించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)