'ఆదిపురుష్' చిత్రంలో మర్యాదా పురుషోత్తముడు శ్రీరామ చంద్రుని పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న పాన్ వరల్డ్ సినిమా 'కల్కి 2898 ఏడీ'లో శ్రీ మహా విష్ణువు పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. మరోసారి వెండితెరపై భగవంతుని పాత్రలో కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి మహా శివుని పాత్రలో కనిపించనున్నారు. 


'కన్నప్ప'లో శివునిగా ప్రభాస్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న భక్తి ప్రధాన చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. ఓ నిజమైన భారతీయ కథ అని అర్థం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించనున్నారు. ఆ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. క్రేజీ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. 


'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు కన్ఫర్మ్ చేశారు. 'హర హర మహాదేవ' అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది విష్ణు చెప్పలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా మహా శివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. 






హాలీవుడ్ స్థాయిలో 'భక్త కన్నప్ప' సినిమా తీయాలని ఉందని కొన్నాళ్ళుగా విష్ణు మంచు చెబుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు 'భక్త కన్నప్ప' అంటే దివంగత రెబల్ స్టార్, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గుర్తుకు వస్తారు. ఆయన హీరోగా వచ్చిన 'భక్త కన్నప్ప' ఏ స్థాయిలో విజయవంతమైందనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఇప్పుడు 'కన్నప్ప'గా విష్ణు నటిస్తున్నారు. కృష్ణం రాజు సోదరుని కుమారుడు ప్రభాస్ శివుని పాత్ర పోస్తున్నారు. 


Also Read : 'సలార్' టికెట్ డబ్బులు రిఫండ్ - ప్రభాస్ ఫ్యాన్స్ అప్‌సెట్!


అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు మంచు తండ్రి మోహన్ బాబు (Mohan Babu) 'కన్నప్ప' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకు, ప్రభాస్ (Prabhas)కు మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై'లో నటించిన సంగతి తెలిసిందే. 


Also Read : మెహర్ రమేష్ తీసిన 'మెగా' డిజాస్టర్ - చిరంజీవి 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్



'కన్నప్ప'కు స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. భక్త కన్నప్ప, అతని భక్తి గురించి ఈ తరం ప్రేక్షకులకు సైతం తెలియజేసేలా సినిమాను తెరకెక్కిస్తామని విష్ణు మంచు తెలిపారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial