బాలీవుడ్‌లో పవన్ సినిమాకు ప్లస్సే - 'యానిమల్'కు మించి ఉంటుందా?


Bobby Deol Role In Hari Hara Veera Mallu Movie: బాబీ డియోల్... ఇప్పుడీ బాలీవుడ్ సీనియర్ హీరోకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయన వెతుక్కుంటూ విలన్ రోల్స్ వెళుతున్నాయి. థాంక్స్ టు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా... ఒక్క సినిమాతో బాబీ డియోల్ రేంజ్ అమాంతం మార్చేశాడు. 'యానిమల్'తో ఆయనకు సరికొత్త ఇమేజ్ తీసుకు వచ్చాడు. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్, స్టార్ డమ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. 'యానిమల్'కు మించి అనేట్టు... 'హరి హర వీరమల్లు'లో ఆయన క్యారెక్టర్ ఉండవచ్చని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ


Heeramandi Web Series Review In Telugu: సంజయ్ లీలా భన్సాలీ... ప్రేక్షకుల్లో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. హిస్టారికల్ సినిమాలు తీయడంలో ఆయనది సపరేట్ ట్రాక్ రికార్డ్. ఒక్కటి కాదు... 'రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్', 'గంగూబాయి కతియావాడి'తో విజయాలు అందుకున్నారు. తొలిసారి ఆయన ఓ వెబ్ సిరీస్ తీశారు. 'హీరామండీ: ది డైమండ్ బజార్'తో ఓటీటీలోకి వచ్చారు. మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి వంటి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్లతో పాటు బాలీవుడ్ భామలు సోనాక్షీ సిన్హా, రిచా చద్దా, షర్మీన్ సెగల్ మెహతా, సంజీదా షైఖ్ కీలక పాత్రల్లో నటించారు. లాహోర్ నేపథ్యంలో స్వాతంత్ర్యానికి పూర్వం సాగే కథతో తీసిన సిరీస్ ఇది. ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' ట్రైలర్


Baahubali Crown Of Blood Trailer Released: దర్శక-ధీరుడు రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి తెలుగు పాన్‌ ఇండియా మూవీ 'బాహుబలి'. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈసినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ వసూళ్లు సునామి సృష్టించింది. మన తెలుగు సినిమాను ఇంటర్నేషనల్‌‌ వైడ్‌గా పరిచయం చేసిన చిత్రమిది. ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో 'బాహుబలి' ఓ హిస్టరీ క్రియేట్‌ చేసిందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమను శాసిస్తున్న'పాన్‌ ఇండియా' ట్రెండ్‌ ఈ సినిమాతోనే మొదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు, వాళ్లిద్ద‌రే నా ఫ్రెండ్స్: రాజ‌మౌళి


Rajamouli About Ntr: రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య బాండింగ్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక 'ఆర్ ఆర్ ఆర్' ప్ర‌మోష‌న్స్ లో కూడా ఎన్టీఆర్ జ‌క్క‌న్న‌ను టీజ్ చేస్తున్న వీడియోలు గ‌తంలో చాలానే వైర‌ల్ అయ్యాయి. దీంతో వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు అంద‌రూ. అయితే, ఎన్టీఆర్ త‌న ఫ్రెండ్ కాద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు రాజ‌మౌళి. ఆయ‌న ఫ్రెండ్స్ వేరే అని అన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘పుష్ప 2‘ సాంగ్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్


Pushpa 2 Song: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘పుష్ప 2‘ సినిమా నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. ‘పుష్ప  పుష్ప పుష్పరాజ్..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటోంది. ఫుల్ గ్రేస్ తో బన్నీ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ పాటలోని చిన్న క్లిప్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘పుష్ప పుష్ప సాంగ్ లో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చారు. అంతేకాదు, #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ ట్యాగ్స్ పెట్టాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)