Jamie Lever At Aa Okkati Adakku Pre Release Event: బాలీవుడ్‌లో ప్రముఖ కామెడియన్‌గా పేరు దక్కించుకున్నారు జానీ లివర్. ఆయన తెలుగువారే అయినా కూడా బీ టౌన్‌లో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు. ఒకప్పుడు జానీ లివర్ ఉన్నాడంటే చాలు.. సినిమా హిట్టే అనుకునేవారు ప్రేక్షకులు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్లుగా ఉన్న ఎంతోమంది హీరోలు.. అప్‌కమింగ్‌గా ఉన్నప్పుడే జానీకి విపరీతమైన పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఆయన వారసురాలిగా జేమీ లివర్.. సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. తన ఎంట్రీ కోసం టాలీవుడ్‌ను ఎంచుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది జేమీ లివర్.


తర్వాత తెలియదు..


అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. మూవీ టీమ్ అంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. అందులో జేమీ లివర్ స్పీచ్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముందుగా తన స్పీచ్‌ను ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేసి మెల్లగా తెలుగులోకి వస్తా అని చెప్పి అందరినీ నవ్వించింది జెమీ లివర్. ‘‘ఇది నాకు చాలా సంతోషకరమైన, ముఖ్యమైన రోజు. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన ఒక లైన్ ఇది.. ‘అందరికీ నమస్కారం’.. ఇది 10 సార్లు ప్రాక్టీస్ చేశాను. కానీ తర్వాత ఏం చెప్పాలో తెలియదు’’ అని చెప్పుకొచ్చింది జేమీ లివర్.


ఆయనకు పెద్ద థ్యాంక్స్..


‘‘జీవితంలో ఒక్క తెలుగు సినిమా అయినా చేయాలన్నది నా కల. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక కామెడీ సినిమా. నాకు కామెడీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అది నాకు చాలా నేచురల్‌గా వస్తుంది. అందరికంటే ముందుగా నరేశ్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే నన్ను గుర్తించి ఈ సినిమాలో క్యాస్ట్ చేశారు. టాలీవుడ్‌లో నాకు మొదటి సినిమానే అయినా ఇదే నాకు ఇల్లు అనిపిస్తోంది. నన్ను గైడ్ చేసి నడిపించిన అందరికీ థ్యాంక్స్’’ అంటూ ‘ఆ ఒక్కటి అడక్కు’ టీమ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంది జేమీ లివర్.


తండ్రిని ఇమిటేట్ చేస్తూ కామెడీ..


బాలీవుడ్‌లో జానీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటికీ చాలా బాలీవుడ్ మీమ్స్.. ఆయన ఎక్స్‌ప్రెషన్‌పైనే క్రియేట్ అవుతుంటాయి. ఆయన వారసురాలిగా జేమీ లివర్ కూడా తన తండ్రి ఎక్స్‌ప్రెషన్స్‌ను ఇమిటేట్ చేయగలదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తండ్రిని ఇమిటేట్ చేస్తూ జేమీ చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందుకే ‘ఆ ఒక్కటి అడక్కు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తన తండ్రి ఎక్స్‌ప్రెషన్‌ను ఇమిటేట్ చేసి చూపించమని అడగగా.. అసలు ఆలోచించకుండా తన తండ్రి డైలాగ్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇచ్చి అందరినీ నవ్వించింది జేమీ లివర్.



Also Read: ఔను, అలా చేశా - లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యాలి: నాగ చైతన్య బోల్డ్ కామెంట్స్ వైరల్