Naga Chaitanya admitted he cheated in a relationship: నాగ చైతన్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ హెడ్ లైన్స్ లో కనిపిస్తున్నారు. ఆయన ఏదో రిలేషన్ షిప్ లో ఉన్నారని, ఎవరితోనే డేటింగ్ చేస్తున్నారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే, వాటిపై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. ఇక ఆయన మీద వస్తున్న రూమర్స్ నేపథ్యంలో ఆయన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంట్లో రిలేషన్ షిప్ లో మోసం చేశానని చెప్పాడు నాగ చైతన్య.
లైఫ్ లో అన్ని అనుభవించాలి..
నాగ చైతన్య నటించిన సినిమా.. ‘శైలజా రెడ్డి అల్లుడు’. 2018లో రిలీజైంది ఈ సినిమా. అయితే, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను ఇమాన్యుయేల్‌తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎప్పుడైనా రెండు సార్లు రిలేషన్ షిప్‌లో ఉన్నారా అని ప్రశ్నించగా.. తాను అలా చేయలేదని అను సమాధానం చెప్పింది. నాగ చైతన్య మాత్రం.. ‘అవును’ అని అన్నారు. “ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిదాన్ని అనుభవించాలి. మీరు పెద్దయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే.. నాకు అన్ని అనుభవాలు ఉన్నాయని అనిపించాలి’’ అని చెప్పాడు. ఆ కామెంట్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, సమంత ఇద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో నాగ చైతన్య ఇలాంటి కామెంట్స్ చేయడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య మోసం చేసింది సమంతనే అని అంటున్నారు.
సాయి పల్లవితో 'తండేల్' ..
నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. చందూ మొండేటీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్రలో చేపలు పట్టి జీవనం సాగించే జాలర్లు పాకిస్తాన్ లో కి వెళ్లి పడ్డ కష్టాలను తెరకెక్కిస్తున్నారు. 'తండేల్' టీజర్ ఇప్పటికే రికార్డులు సృష్టించింది. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.
40 కోట్లకు కొన్న నెట్ ఫ్లిక్స్..
ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రూ.40 కోట్లకు అమ్ముడు అయ్యాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే నాగచైతన్య కెరీర్ లో ఇదే రేర్ రికార్డు అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. చైతన్య కెరీర్ మొత్తం మీద ఆయన సినిమాకు ఓటీటీ రైట్స్ ద్వారా ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి.
డిఫరెంట్ లుక్ లో చై, సాయిపల్లవి..
ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరు డీ గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం చైతన్య ప్రత్యేకంగా శ్రీకాకుళం యాస నేర్చుకున్నారట. కాస్ట్యూమ్స్, బాడీ ల్యాంగ్వేజ్ అన్ని విషయాల్లో శ్రద్ధ వహించారు నాగ చైతన్య. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: లిప్ లాక్ సీన్ చూసి మా ఆవిడ ఆ సలహా ఇచ్చింది: సుహాస్