Hero Suhas About his Wife Reaction After seeing Lip Lock Scene: సుహాస్.. ఆయ‌న సినిమాల‌న్నీ చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. క‌థ‌లు ఎంచుకోవ‌డం చాలా స్పెష‌ల్ గా వుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుహాస్ తీసిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్. ఇక అవ‌న్నీ ఫ్యామిలీ ఓరియెంటెండ్ ల‌వ్ స్టోరీస్ అనే చెప్పాలి. ఎలాంటి రొమాన్స్ కానీ, ముద్దు సీన్లు లాంటివి ఉండ‌వు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన సినిమా 'ప్ర‌స‌న్న వద‌నం'లో సుహాస్ లిప్ లాక్ సీన్ లో నటించారు. అయితే, ఆ సీన్ చూసి త‌న వైఫ్ ఎలా రియాక్ట్ అయ్యిందో చెప్పారు ఆయ‌న‌. 


ఆమె సినిమా చూసి ఇలా అంది.. 


మే 3న 'ప్ర‌స‌న్న వ‌ద‌నం' సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ చేస్తోంది సినిమా టీమ్. దాంట్లో భాగంగా మీడియాతో ఇంట‌రాక్ష‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లిప్ లాక్ గురించి అడిగారు. లిప్ లాక్ సీన్ కోసం మీ భార్య ప‌ర్మిష‌న్ తీసుకున్నారా? అని అడిగిన ప్ర‌శ్న‌కి సుహాస్ చాలా ఫ‌న్నీ ఆన్స‌ర్ ఇచ్చారు. వాళ్ల ఆవిడ సినిమా చూసింద‌ని, చూసిన‌ప్పుడు ఆమె తనను టీజ్ చేసింద‌ని అన్నారు. "ఊ..ఊ.. ఊ.. అని వెక్కిరించింద‌ని" అన్నారు. "మ‌నం స‌రిగ్గా చేయ‌డం క‌దా అలాంటివి.. "స‌రిగ్గా చేయి.. యాక్టింగ్ లో అయినా స‌రిగ్గా చేయి" అనింద‌ని" చెప్పారు సుహాస్. 


క‌థ‌లో మీ ఇన్వాల్మెంట్ ఏమైనా ఉంటుందా? 


సుహాస్ చూజ్ చేసుకునే క‌థ‌ల‌న్నీ చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. ఆయ‌న మూవీ టైటిల్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి. దీంతో మీరు  క‌థ రాయ‌డంలో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా ?  టైటిల్ పెట్ట‌డంలో  ఏమైనా జోక్యం చేసుకుంటారా? అని అడిగితే.. "క‌థ‌ను అస్స‌లు ట‌చ్ చేయ‌ను.. టైటిల్స్ మాత్రం బెస్ట్ 5 చెప్ప‌మ‌ని అడిగి సెలెక్ట్ చేస్తాను. ఈ సినిమాకి చెప్పిన ఫ‌స్ట్ టైటిల్ 'ప్ర‌స‌న్న వ‌ద‌నం'.. అదే ఫిక్స్ చేశాం" అని చెప్పారు సుహాస్. 


మే 3న ప్రేక్ష‌కుల ముందుకి.. 


సుహాస్ ఈ సినిమాలో చాలా డిఫ‌రెంట్ గా క‌నిపించ‌బోతున్నాడు. రెగ్యుల‌ర్ గా కాకుండా సుహాస్ చాలా డిఫ‌రెంట్ గా ఈ స్టోరీని ఎన్నుకున్నాడు. ఈసారి కూడా స‌రికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు సుహాస్. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త కాన్సెప్ట్ కావ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ కాగా.. సినిమాని అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్నాడు. మే 3న సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, టీజ‌ర్ అన్ని ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో వైవా హ‌ర్ష కూడా ఉన్నారు. దీంతో కామెడీ కూడా బాగుంటుంద‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ప్రేక్ష‌కులు. క‌ల‌ర్ ఫొటోల లాగా.. ఇద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి చూడాలి సుహాస్.. ఏరేంజ్ లో మెప్పిస్తాడు అనేది.


Also Read: ‘బిగ్ బాస్’ గీతూకు అరుదైన వ్యాధి - ఆ అలవాట్లు మార్చుకోకపోతే 40 ఏళ్లకు మించి బతకడం కష్టమే!