Chiranjeevi May Day Video Goes Viral: మే డే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన నటించిన ఓ యాడ్‌ వీడియో షేర్‌ చేస్తూ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో చైల్డ్‌ లేబర్‌ ప్రోత్సహించకుడదు అనే సారాంశం ఉంది. ఇది 22 ఏళ్ల క్రితం ఓ ఆర్గనైజేషన్‌కి చిరంజీవి ఇచ్చిన యాడ్ వీడియో ఇది. దీన్ని చిరంజీవి షేర్‌ చేస్తూ.. "22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగాచేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన 'చిన్ని చేతులు' campaign. ఈ రోజుకీ కూడా ఈ వీడియో పనికొస్తుందని షేర్ చేస్తున్నాను. చైల్డ్ లేబర్‌ని ప్రోత్సహించకండి. హ్యాపీ మేడే" అంటూ పోస్ట్ చేశారు.


దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఇంట్లో మని మనిషిగా చేస్తున్న ఓ మహిళా తనతో పాటు తన ఐదేళ్ల చిన్నారిని పనికి తీసుకువెళుతుంది. తనతో పాటు గిన్నెలు కడుగుతున్నట్టు చూపించారు. ఆ పక్కనే ఆ ఇంటి యజమాని తన కూతురిని చదివిస్తుంది. అదే టైంలో గిన్నెలు కింద పడేసిన శబ్ధం రావడంతో ఆమె ఆ పని మనిషి కూతురిని విసుక్కుంటుంది. దీంతో మనసులో నాలాగా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది. నా చేతుల్లో ఏం ఉంది.అంతా నా తలరాత అని అనుకుంటుంది. అప్పుడే చిరంజీవి "చూడమ్మా అలా తలరాతను తింటుకుంటు కూర్చుంటే కుదరదు. నువ్వూ మీ అమ్మాయికి మంచి భవిష్యత్తును ఇవ్వోచ్చు. దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే. బడికి పంపించమ్మా, పనికి కాదు"  అని చెప్పిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. మే సందర్భంగా చిరంజీవి షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మంచి మెసేజ్‌ ఇచ్చారని, యూజ్‌ఫుల్‌ వీడియో షేర్‌ చేశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 






'విశ్వంభర'తో బిజీ


ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజైన టైటిల్ పోస్టర్‌, కాన్సెప్ట్‌ వీడియోకు విశేషంగా ఆకట్టుకున్నాయి. 'విశ్వంభర' అనేది పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ అని కాన్సెప్ట్‌ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమాని వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. 


Also Read: రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్‌ రాయ్‌ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కండంటే