Kalki producer next movie: ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth)లది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'పెళ్లి సందడి' నిర్మాతల్లో వైజయంతీ మూవీస్ అధినేత సి అశ్వినీదత్ కూడా ఒకరు. మోడ్రన్ 'పెళ్లి సందD'తో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా పరిచయం అయ్యారు. ఈ యంగ్ స్టార్ ఇప్పుడు వైజయంతీ మూవీస్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నారు.


ప్రేక్షకుల ముందుకు 'ఛాంపియన్'గా రోషన్!  
రోషన్ (Roshan Meka) హీరోగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థల్లో రూపొందుతున్న సినిమా 'ఛాంపియన్' (Champion Movie). ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడు. షార్ట్ ఫిల్మ్ 'అద్వైతం'కు గాను ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. 'ఛాంపియన్' సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 


జూలైలో సెట్స్ మీదకు 'ఛాంపియన్'
Champion movie regular shoot starts from July: పీరియడ్ యాక్షన్ డ్రామాగా 'ఛాంపియన్' మూవీ రూపొందుతోంది. జూలై నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి యూనిట్ రెడీ అవుతుంది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజికి వచ్చిందని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని, షెడ్యూల్స్ కూడా వేశారని తెలిసింది. జూన్ 27న వైజయంతీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న 'కల్కి' విడుదల కానుంది. ఆ హడావిడి ముగిశాక కొత్త సినిమాలను స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు ఉన్నారు.


Also Readఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!



రోషన్ పుట్టిన రోజు సందర్భంగా 'ఛాంపియన్' సినిమాలో హీరో లుక్ విడుదల చేస్తూ అతడికి శుభాకాంక్షలు చెప్పారు. పొడవాటి జుట్టు, కాస్త గడ్డంతో ఆ పోస్టర్లలో చాలా అందంగా కనిపించాడు రోషన్. ఈ సినిమా కోసం అతడు స్పెషల్ మేకోవర్ అయ్యాడని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హ్యాండ్సమ్ హీరోల్లో రోషన్ పేరు కూడా యాడ్ అయ్యింది. అతడిని ఇంతకు ముందు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ప్రదీప్ అద్వైతం చూపించనున్నారని తెలుస్తోంది.






పాన్ ఇండియా మూవీ 'వృషభ'లో రోషన్!
'ఛాంపియన్'తో పాటు రోషన్ మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అది పాన్ ఇండియా మూవీ 'వృషభ'. అందులో బాలీవుడ్ స్టార్ కిడ్ షనాయా కపూర్ హీరోయిన్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రోషన్ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేశారు.


'వృషభ', 'ఛాంపియన్' కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ ఉన్న కథల కోసం రోషన్ చూస్తున్నారట. తెలుగుతో పాటు హిందీ, ఇతర దక్షిణాది భాషల ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేయాలని చూస్తున్నారట.


Also Readప్రభాస్ మాస్ సాంగ్ చేస్తే... ముగ్గురు హీరోయిన్లతో చిందేస్తే... థియేటర్లలో స్క్రీన్లు చిరిగిపోవూ, కుర్చీలు విరిగిపోవూ!



Champion movie cast and crew: 'ఛాంపియన్' చిత్రానికి ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి, సంగీతం: మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్, నిర్మాణ సంస్థలు: వైజయంతీ మూవీస్ - స్వప్న సినిమా, నిర్మాణం: సి అశ్వనీదత్, దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం.