Siddharth Roy Movie OTT Release: మహేష్ బాబు 'అతడు' చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా సరిచయం అవుతూ నటించిన సినిమా 'సిద్ధార్థ్ రాయ్'. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు మూవీ ప్రచార పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. మూవీ అర్జున్ రెడ్డి తరహాలో ఉంటుందనే ప్రచారం కూడా చేశారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లో మూవీ అంతా ఆకట్టుకోలేపోయింది. బోల్డ్ కంటెంట్ ఉన్న అవి మెప్పించే తరహాలో లేవని ఆయడిన్స్ రివ్యూ ఇచ్చారు. మొత్తానికి బాక్సాఫిసు వద్ద బోల్తా కొట్టిన 'సిద్ధార్థ్ రాయ్' ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. థియేటర్లోకి రిలీజైన రెండు నెలలకు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆహా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని దక్కించుకోగా మే 3వ తేదీ నుంచి ప్రీమియర్ ఇవ్వనుంది. తాజాగా దీనిపై ఆహా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. వి యశస్వి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తన్వి నెగి హీరోయిన్‌గా హీరోయిన్ పరిచయం అయ్యింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సుధాకర్ బోయిన, ప్రదీప్ పూడి, జయ అడపాక ఈ మూవీని నిర్మించారు.
దీపక్ సరోజ్ నటనకు ప్రశంసలు
బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సిద్ధార్థ్ రాయ మూవీ థియేటర్లో ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ రాయ్‌గా దీపక్ సరోజ్ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. హీరో అతడికి ఇద డెబ్యూ మూవీ అయినా తనదైన నటన స్కిల్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే ఈసినిమాలో తన పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండటంతో నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇదోక మంచి అవకాశమని రిలీజ్‌కు ముందు కూడా అన్నాడు. తొలి సినిమాకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర రావడం సంతోషంగా ఉంది దీపక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు. తన్వి నెగి తన గ్లామర్‌తో బాగా ఆకట్టుకుంది. అందాల ఆరబోతతో యూత్‌ను ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలో ఓటీటీ కంటెంట్‌కు సరిపడా మాస్ మాసాలా, బోల్డ్ కంటెంట్ ఉండటంతో ఈ సినిమా డిజిటల్ ప్రియులను బాగానే ఆకట్టుకంటుందని అంటున్నారు. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేని సిద్ధార్థ్ రాయ్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
కథేంటంటే
సిద్ధార్థ్ (దీపక్ సరోజ్)పన్నెండేళ్లకే ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివేస్తాడు. దాంతో లాజిక్‌ని తప్పా ఎమోషన్స్‌ని పట్టించుకోడు. ప్రతి విషయాన్ని లాజిక్ చూసే సిద్ధార్థ్ రాయ్‌లో ఎమోషన్ ఫీలింగ్స్, హ్యుమన్ అటాజ్‌మెంట్స్ అనేవి ఉండవు. ఆకలి వేస్తే ఆకులు తింటాడు. నిద్ర వస్తే రోడ్డు మీదే పడుకుంటాడు. ఇక చిన్నప్పుడే పుస్తకాలన్ని చదివేసిన సిద్ధార్థ్ చదువులో టాప్. క్లాసులో చెబుతున్న పాఠం తనకు తెలిసిందే అనిపిస్తే మధ్యలో నుంచే వెళ్లిపోతాడు. అలా ఒక రోబోలా ఉండే సిద్ధార్థ్ రాయ్‌పై.. హ్యుమన్ అటాచ్‌మెంట్స్, బంధాలు, ఎమోషన్సకి ఇంపార్టెంట్ ఇచ్చే అమ్మాయి ఇందు (తన్వి నేగి). అలాంటి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. అసలు ఎదుటి మనిషి ఫిలింగ్స్, ఎమోషన్సే అర్థం కానీ సిద్దార్థ్ రాయ్‌లో ఇందుపై ప్రేమ ఎలా కలిగింది? తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుకోవాల్సిందే.
Also Read: జర్నలిజం నుంచి స్టార్ హీరోయిన్ వరకు, అనుష్క శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?