Ram Charan's Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్, నార్త్ ఇండియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
చెన్నైలో రెండు రోజుల పాటు షార్ట్ షెడ్యూల్
రామ్ చరణ్ ఇవాళ (మే 1న) చెన్నై ప్రయాణం అవుతున్నాడు. ఇది షార్ట్ ట్రిప్ అని తెలిసింది. రేపటి (మే 2వ తేదీ) నుండి స్టార్ట్ కాబోయే 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణలో ఆయన జాయిన్ అవుతారు. అలాగని, ఇదేమీ పెద్ద షెడ్యూల్ కాదు. జస్ట్... రెండు రోజులు పాటు చేసే షార్ట్ షెడ్యూల్. గురు, శుక్ర వారాల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మళ్లీ హైదరాబాద్ వస్తాడు రామ్ చరణ్.
షూటింగ్ కంప్లీట్ స్టేజికి వచ్చిన 'గేమ్ ఛేంజర్'
'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చిందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 'ఒకే ఒక్కడు', 'భారతీయుడు' తరహాలో శంకర్ సోషల్ మెసేజ్ ఉన్న స్టోరీ రెడీ చేశారు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన 'జరగండి...' పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా వైరల్ అయ్యింది.
Also Read: ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!
రామ్ చరణ్ జోడీగా ప్రజెంట్ జనరేషన్ స్టోరీలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ యాక్ట్ చేసింది. తెలుగులో ఆమెకు థర్డ్ మూవీ ఇది. చరణ్ సరసన సెకండ్ మూవీ. ఇంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా 'భరత్ అనే నేను' చేసింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ'లో యాక్ట్ చేసింది. ఇప్పుడు మరొక సారి చరణ్ మూవీ చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయి అంజలి యాక్ట్ చేస్తోంది.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో 'గేమ్ ఛేంజర్' మీద భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ కోసం మెగా అభిమానులు, పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజు, మాటలు: సాయి మాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, సంగీతం: తమన్, సమర్పణ: శ్రీమతి అనిత, నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - జీ స్టూడియోస్, నిర్మాతలు: 'దిల్' రాజు - శిరీష్, దర్శకత్వం: శంకర్.