Anupam Kher Meets Jr NTR: కొన్ని సినిమాల వల్ల టాలీవుడ్ స్థాయి మాత్రమే కాదు... తెలుగు హీరోల స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’లో తన నటనతో ప్రేక్షకులను మాత్రమే కాదు... ఇతర సెలబ్రిటీలను కూడా ఫిదా చేశాడు తారక్. అందుకే ఎన్టీఆర్‌ను కలవడానికి ఇతర భాషా సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్... ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


నాకు ఇష్టమైన వ్యక్తి తారక్...


‘‘నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరైన తారక్‌ను గత రాత్రి కలవడం చాలా సంతోషంగా ఉంది. అతని నటన నాకు చాలా నచ్చింది. అతను ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అనుపమ్ ఖేర్. అయితే వీరిద్దరూ కలవడానికి ఏమైనా స్పెషల్ కారణముందా లేదా మామూలుగానే కలిశారా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్... ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దాంతో అనుపమ్ ఖేర్ మామూలుగానే ఎన్టీఆర్‌ను కలిశాడా లేదా ఆయన కూడా ఆ సినిమాలో నటిస్తున్నారా అని ప్రేక్షకులు సందేహిస్తున్నారు.






వార్ 2తో పాటు దేవర చేస్తున్న ఎన్టీఆర్...


వార్ 2 కాకుండా ఎన్టీఆర్ మరో మూవీ చేస్తున్నారు. అదే ‘దేవర’. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. అందుకే ‘దేవర’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక భారీ స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని అర్థమవుతోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలోనే ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. ముందుగా ప్రకటించిన ‘దేవర’ రిలీజ్ డేట్‌కు, ప్రస్తుతం ఉన్న రిలీజ్ డేట్‌కు సంబంధమే లేదు. అయినా కచ్చితంగా మూవీ నచ్చేలా ఉంటుందని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు ఎన్టీఆర్.



ఇప్పటికే రెండు సినిమాల్లో..


అనుపమ్ ఖేర్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెలిగిపోతున్నారు ఈ నటుడు. ఇక గత కొన్నేళ్లలో బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్‌లో నటించడం ఆనవాయితీగా మారడంతో ముందుగా ‘కార్తికేయ 2’లో ఒక ముఖ్యమైన సీన్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించారు అనుపమ్ ఖేర్. ఆయన పాత్ర, ఆ సీన్.. ‘కార్తికేయ 2’ స్థాయినే పెంచేసింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’లో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు అనుపమ్ ఖేర్. తాజాగా ఎన్‌టీఆర్‌తో పోస్ట్ చేసిన ఫోటో చూసిన తర్వాత తనతో కూడా నటిస్తున్నారేమో అని అనుమానాలు మొదలయ్యాయి.



Also Read: ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!