Bigg Boss Geethu Royal: బిగ్ బాస్ అనే రియాలిటీ షో.. ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది. ఎంతోమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ వ్లాగర్లు.. ఈ రియాలిటీ షోలోకి వచ్చి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్‌ను కూడా సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు గీతూ రాయల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది గీతూ. ఈ షోలోకి వచ్చిన తర్వాత గలాటా గీతూగా పేరు సాధించింది. టైటిల్ విన్నర్ అవుతాననే కలలతో వచ్చిన గీతూ.. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. తాజాగా తనకు ఒక అరుదైన వ్యాధి సోకిందంటూ గీతూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.


బిగ్ బాస్ తర్వాత క్రేజ్..


బిగ్ బాస్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు సీజన్ 6లో జరిగిన గీతూ ఎలిమినేషన్ బాగా గుర్తుండిపోతుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్‌లో ఏ ఎలిమినేషన్‌లో కూడా కంటెస్టెంట్.. ఆ రేంజ్‌లో ఎమోషనల్ అవ్వలేదు. బిగ్ బాస్ 6 చివరి వరకు కూడా తను మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో అనే ఆశపడింది గీతూ. కానీ అలా జరగలేదు. కానీ బిగ్ బాస్‌లోకి రావడం వల్ల తనకు మంచే జరిగింది. సోషల్ మీడియాలో తనకు ఫాలోయింగ్ పెరిగింది. తను పోస్ట్ చేసే ప్రతీ వీడియోకు లైకులు, షేర్‌లు పెరిగాయి. అలా ఎప్పుడూ ఆడుతూ పాడుతూ యాక్టివ్‌గా ఉండే గీతూ.. తాజాగా షేర్ చేసిన ఒక వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అరుదైన వ్యాధి..


జనవరి నుండే తనకు పలు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని గీతూ చెప్పుకొచ్చింది. తరచుగా తలనొప్పి, వాంతులతో పాటు తిండి మీద ధ్యాస లేకపోవడంతో అసలు సమస్య ఏంటని తెలుసుకోవడం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిందట గీతూ. అసలు తన సమస్య ఏంటో తెలుసుకోవడం కోసం డాక్టర్ల ఆమెపై పలు పరీక్షలు నిర్వహించారు. ఆపై తనకు మైక్రో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబర్‌క్యూలర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేల్చారు డాక్టర్లు. టీబీ వ్యాధిలో ఇది కూడా రకమని వారు చెప్పారు. అయితే ఈ వ్యాధి అందరికీ రాదని, చాలా అరుదుగా వస్తుందని వివరించారు. దీంతో గీతూ రాయల్‌కు ఒక్కసారిగా షాక్ తగిలింది.


ఆర్థిక ఇబ్బందులు..


గీతూ వచ్చిన వ్యాధికి చికిత్స కూడా ఉందని చెప్పి డాక్టర్లు తనకు కాస్త రిలీఫ్ ఇచ్చారు. ఈ వ్యాధి తగ్గాలంటే రెండేళ్ల పాటు అయిదు ఇంజెక్షన్లు తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట. అంతే కాకుండా ఇంజెక్షన్లతో పాటు రెండేళ్ల వరకు పలు మెడిసిన్స్ కూడా ఉపయోగించాల్సి ఉంటుందట. ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అందుబాటులో ఉన్నా కూడా అవన్నీ చాలా కాస్ట్‌లీ అని, దాని వల్ల తను ఆర్థికలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. డాక్టర్లు తన వ్యాధి గురించి చెప్పిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లానని, ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త పరవాలేదని తెలిపింది. ఇక వారు చెప్పినదాని ప్రకారం తన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే 40 ఏళ్లకు మించి బ్రతకదన్నారని బయటపెట్టింది. ప్రస్తుతం యూత్ పాటిస్తున్న చాలావరకు అలవాట్లే వారికి ఇలాంటి వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో ఎంటర్టైన్మెంట్ ధూమ్ ధామ్ - మేలో అలరించే మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే!