Heeramandi The Diamond Bazaar Release Date: సంజయ్ లీలా భన్సాలీ... జస్ట్ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియన్స్ కూడా ఇష్టపడే దర్శకుడు. ఆయనకు దక్షిణాదిలోనూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండీ: ది డైమండ్ బజార్'. ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. మరి, దీనిని ఎందులో చూడవచ్చో తెలుసా?


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'హీరామండీ'
Heeramandi streaming in Telugu also: ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'హీరామండీ'. ఈ రోజు రిలీజ్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియన్స్ కోసం ఓ గుడ్ న్యూస్.... ఇవాళ్టి నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.


Also Readకల్కి నిర్మాతలతో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?






'హీరామండీ'లో ఎవరెవరు ఉన్నారు? దీని కథ ఏమిటి?
Heeramandi Cast And Crew: అదితి రావు హైదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'హీరామండీ'లో ఆవిడ ఓ ప్రధాన పాత్ర చేశారు. అదితితో పాటు బాలీవుడ్ భామలు సోనాక్షి సిన్హా, రిచా చద్దా కూడా ఉన్నారు. 'భారతీయుడు', 'బొంబాయి', 'ఒకే ఒక్కడు' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మనీషా కొయిరాలా మరో ప్రధాన పాత్ర పోషించారు. సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తాహా షా బాదుషా, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. 


Also Readఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!



'హీరామండీ'లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ వున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు... మొఘల్ కాలంలో లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్న నగరం) సిటీ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. వేశ్యల జీవితాల్లో ఏం జరుగుతుంది? ఏమైంది? అనేది కథ. బాలీవుడ్ నుంచి 'హీరామండీ'కి మంచి రివ్యూలు వస్తున్నాయి. మరి సౌత్ ఇండియా నుంచి ఎటువంటి రివ్యూలు వస్తాయో చూడాలి.