Netflix May 2024 Upcoming Movies And Web Series: సినీ అభిమానులకు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ అందించడంలో ముందుంటుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్లలో విడుదలైన మూవీస్ తో పాటు పాటు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లను నేరుగా తన ఓటీటీ వేదికగా అందిస్తోంది. నిత్యం నెట్ ఫ్లిక్స్ సరికొత్త కంటెంట్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. రోజు రోజుకు నెట్ ఫ్లిక్స్ వేదిగా విడుదలయ్యే సినిమాలు, సిరీస్ ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక వేసవిలో ఎంటర్ టైన్మెంట్ డోస్ మరింత పెంచబోతోంది. మే నెలలో బోలెడు సిరీస్ లు, సినిమాలను అభిమానుల ముందుకు తీసుకురాబోతోంది. ఇంతకీ ఈ నెలలో ప్రేక్షకులను అలరించే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మేలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే!
1.హీరామండి: ది డైమండ్ బజార్- వెబ్ సిరీస్- మే 1న విడుదల
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. ఈ వెబ్ సిరీస్ మే 1న నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, సోనాక్షి సిన్హా, షార్మీన్ సేగల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ పై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తొలి వెబ్ సిరీస్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మే 1న హిందీతో పాటు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
2.ది హాలీడే- హాలీవుడ్ మూవీ- మే 1న విడుదల
3.ఎ మ్యాన్ ఇన్ ఫుల్- వెబ్ సిరీస్- మే 2న విడుదల
4.టీ.పీ బాన్- జపనీస్ వెబ్ సిరీస్- మే 2న విడుదల
5.అన్‌ఫ్రాస్టెడ్ – హాలీవుడ్ మూవీ- మే 3న విడుదల
6.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎపిసోడ్ 6- మే4న విడుదల
7.సూపర్ రిచ్ ఇన్ కొరియా xxx- రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్- సౌత్ కొరియా వెబ్ సిరీస్- మే 7న విడుదల
8.ది ఫైనల్: ఎటాక్ ఆన్ వాంబ్లీ- హాలీవుడ్ మూవీ- మే 8న విడుదల
9.క్రేజీ రిచ్ ఆసియన్స్- హాలీవుడ్ మూవీ- మే 8న విడుదల
10.మదర్ ఆఫ్ ది బ్రైడ్- హాలీవుడ్ మూవీ- మే 9న విడుదల
11.లివింగ్ విత్ లియో పార్డ్స్- హాలీవుడ్ మూవీ-మే 10న విడుదల
12.బ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్-2- వెబ్ సిరీస్- మే 10న విడుదల
13.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎపిసోడ్ 7- మే 11న విడుదల
14.బ్రిడ్జర్టన్సీజన్ 3 పార్ట్ 1- వెబ్ సిరీస్- మే 16న విడుదల
Read Also: ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!