Bobby Deol Role In Hari Hara Veera Mallu Movie: బాబీ డియోల్... ఇప్పుడీ బాలీవుడ్ సీనియర్ హీరోకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయన వెతుక్కుంటూ విలన్ రోల్స్ వెళుతున్నాయి. థాంక్స్ టు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా... ఒక్క సినిమాతో బాబీ డియోల్ రేంజ్ అమాంతం మార్చేశాడు. 'యానిమల్'తో ఆయనకు సరికొత్త ఇమేజ్ తీసుకు వచ్చాడు. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్, స్టార్ డమ్ క్రియేట్ అయ్యేలా చేశాడు. 'యానిమల్'కు మించి అనేట్టు... 'హరి హర వీరమల్లు'లో ఆయన క్యారెక్టర్ ఉండవచ్చని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్!?
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' టీజర్ ఇవాళ విడుదలైంది. అందులో పవర్ స్టార్ గెటప్, ఆ సెటప్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే... పవన్ నయా అవతార్ ముందు ప్రేక్షకుల్ని ఆకర్షించిన మరొక క్యారెక్టర్ బాబీ డియోల్ (Bobby Deol As Mughal Emperor)ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. టీజర్ చూస్తే... ఆయన క్యారెక్టర్ క్రూరమైన చక్రవర్తిగా ఉండబోతుందని అర్థం అవుతోంది. టీజర్‌లో 30 సెకన్ల నుంచి 40 సెకన్ల వరకు బాబీ డియోల్ వన్ మ్యాన్ షో రన్ అయ్యింది. ఆయన లుక్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకు ప్రతి విషయంలో విలనిజం కనిపించింది. ఇంకా చెప్పాలంటే... 'యానిమల్' గుర్తుకు వచ్చింది.
'యానిమల్'లో బాబీ డియోల్ ఒక్క డైలాగ్ చెప్పలేదు. కానీ, కుమ్మేశారు. సేమ్ టు సేమ్... 'హరి హర వీరమల్లు' టీజర్‌లోనూ అంతే! ఒక్క డైలాగ్ లేదు. మూవీలో ఉంటాయో? లేదో? ప్రస్తుతానికి మాత్రం ఆయన క్యారెక్టర్ సూపర్ హిట్ అయ్యింది.
బాలీవుడ్ మార్కెట్‌లో వీరమల్లుకు ప్లస్సే!
బాబీ డియోల్ క్యారెక్టర్ 'హరి హర వీరమల్లు' సినిమాకు బాలీవుడ్ మార్కెట్, అక్కడి ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇంతకు ముందు 'సర్దార్ గబ్బర్ సింగ్'ను హిందీలో విడుదల చేశాడు పవన్. అయితే, ఆశించిన రిజల్ట్ రాలేదు. నిజానికి, అది పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు.
'హరి హర వీరమల్లు' అలా కాదు... పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఆల్ ఓవర్ ఇండియా చూసే కాన్సెప్ట్. మొఘల్ చక్రవర్తులను దోచుకునే బందిపోటు అంటే క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు ఉత్తరాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాకు బాబీ డియోల్ కూడా ప్లస్సే. ఈ సినిమా 2024లో చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ సీజన్ టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.
'హరి హర వీరమల్లు' మూవీతో పాటు సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ 'కంగువా'లో కూడా బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు.
Also Read: 'కూలీ'పై ఇళయరాజా గరమ్ గరమ్ - లీగల్ చిక్కుల్లో రజనీకాంత్ సినిమా