The Maid (ది మెయిడ్) 2020లో విడుదలయిన సూపర్ నేచురల్ హార్రర్ ఫిల్మ్. పనిమనిషిగా ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారింది. ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? ఆమెకు ప్రతీకారం తీర్చుకోవటానికి సహాయపడిన అమ్మాయి ఎవరు? ఆద్యంతం ట్విస్టులతో, వణుకుపుట్టించే విజువల్స్‌తో చివరి వరకు గ్రిప్పింగ్‌గా సాగే కథే The Maid.
ఇదీ కథ
అత్యంత ధనవంతులైన ఉమా, నిరాచ్ అనే భార్యాభర్తల ఇంట్లో ఒక డొమెస్టిక్ హెల్పర్ పనిచేస్తుంటుంది. ఆమె నిద్రపోయినపుడు ఒక కోతిబొమ్మ కలలోకి వచ్చి భయపెడుతుంది. ఆ తర్వాత రోజు చూస్తే, నిజంగానే ఆ బంగళాలో ఉన్న కోతిబొమ్మ ఆమెను భయపెడుతుంది. నిరాచ్, ఉమాల కూతురు నిడ్ ను రాత్రి పడుకోబెట్టి లైట్ ఆపగానే ఆ కోతిబొమ్మకు ప్రాణం వస్తుంది. ఆ పనిమనిషి సైకియాట్రిస్ట్ దగ్గర టీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. రోజురోజుకీ ఆ కోతిబొమ్మ టార్చర్ పెడుతుండటంతో ఇక ఆ ఇంట్లో పనిచేయలేనని యజమానులకు చెప్పేసి వెళ్లిపోతుంది. కొత్త పనిమనిషిని చూడమని డ్రైవర్‌కు చెప్తే, ఆ పాత హెల్పర్ స్థానంలోకి జాయ్ అనే అమ్మాయిని పనిమనిషిగా వస్తుంది.
ఆ బంగళాలో ఉండే సీనియర్ డొమెస్టిక్ హెల్పర్.. జాయ్‌కు బంగళా మొత్తం చూపిస్తుంది. ఓనర్స్ కూతురైన నిడ్‌ను కూడా జాయ్‌కు పరిచయం చేస్తుంది. ఇక్కడ పనిమనుషులు ఎందుకు త్వరత్వరగా మారిపోతున్నారు అని జాయ్ అక్కడి డ్రైవర్‌ను అడుగుతుంది. అతను ఒక లుక్ ఇచ్చి ఏమీ చెప్పకుండా తన గది చూపించి వెళ్లిపోతాడు. జాయ్ తనకు ఎదురుగా అద్దంలోకి చూసినపుడు ఒక భయంకరమైన ఆకారం కనపడుతుంది. ఆ రాత్రి భయంభయంగా తన గదిలో నిద్రపోతుంది.
మరుసటి రోజు రాత్రి జాయ్.. నిడ్‌ను నిద్రపుచ్చి, లైట్ ఆర్పగానే, ఒక మూలన దెయ్యం కనిపిస్తుంది. మళ్లీ లైట్ వేయగానే ఆ దెయ్యం మాయమవుతుంది. ఒకరోజు ఏదో వెతుకుతున్నట్టుగా నిరాచ్ గదిలోకి వెళ్ళేటప్పటికి ఒక ఫొటో కనిపిస్తుంది. ఆ ఫొటోలో నిరాచ్, ఉమాతో పాటూ ఇంకో అమ్మాయి ఉంటుంది. ఆ ఫొటోలోని అమ్మాయే దెయ్యంగా వచ్చి భయపెడుతుందని జాయ్ తెలుసుకుంటుంది. ఆ దెయ్యం నిడ్‌కు కూడా కనిపిస్తుంది. ఒకరోజు జాయ్ సీనియర్ హెల్పర్స్ తో కలిసి వెళ్లి ఉమాతో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి దెయ్యంగా వచ్చి మమ్మల్ని భయపెడుతోందని చెప్తుంది. ఉమా తనకేమి తెలియనట్లుగా, ఈమె కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసేది అని చెప్తుంది.
ఫ్లాష్ బ్యాక్ లో ఉమా, నిరాచ్‌ల రిలేషన్షిప్ అంత బాగా లేదని, ప్లాయ్ అనే ఆ పాత పని అమ్మాయి (ఫొటోలో అమ్మాయి) ఉమాకు శారీరకంగా దగ్గరయినట్టు చూపిస్తారు. ప్లాయ్ గురించి సీనియర్ హెల్పర్స్ అందర్నీ అడుగుతుంది జాయ్. ఆమె ఏడేళ్ల క్రితం ఇక్కడ పనిచేసేది. ఎందుకు మానేసిందో తమకు తెలియదని చెప్తారు అందరూ. ఒకరోజు తన గదిలో నిరాచ్ ఒంటరిగా ఉండి నన్ను క్షమించు అని ఏదో ఆకారంతో మాట్లాడుతూ ఉంటాడు. అది జాయ్ చూస్తుంది. (ట్రైలర్ తర్వాత మిగతా కథ ఉంది).
స్పాయిలర్ అలర్ట్ (ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే.. మిగతా పేరాలు చదవద్దు. ఈ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది)
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ప్లాయ్.. ఉమాతోనే కాకుండా నిరాచ్‌కు కూడా శారీరకంగా దగ్గరవుతుంది. అప్పుడు ప్లాయ్‌కు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ విషయం ఉమాకి తెలిసిపోతుంది. ప్లాయ్‌కు పుట్టిన బిడ్డను తమ బిడ్డగా అందరికీ పరిచయం చేస్తారు. అప్పుడు నిడ్.. ప్లాయ్ కూతురు అన్న విషయం తెలుస్తుంది. ఒకరోజు ప్లాయ్ జారిపడిపోతుంది. ఆమె తలకు దెబ్బతగులుంది. అది చూసి కూడా ఉమా కాపాడదు. ఆమె చనిపోయినట్లు చెబుతుంది. కానీ పాయ్ అప్పటికి బతికే ఉంటుంది. ఆమె చేతులు కూడా కదుపుతుంది. అయినా పట్టించుకోకుండా పాయ్‌ను మట్టిలో పూడ్చిపెడతాడు నిరాచ్.
ప్రస్తుతంలోకి వస్తే, ఆ ప్లాయ్ చెల్లెలే జాయ్ అని తెలుస్తుంది. ప్లాయ్ కనపడకపోవటంతో ఏం జరిగిందో తెలుసుకోవటానికి జాయ్ ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత జాయ్ తన అక్క ప్లాయ్‌ను చంపినవారెవరో తెలుసుకొని పగతో రగిలిపోతూ ఒక్కొక్కర్ని ఎట్లా చంపుతుందనేది మిగిలిన కథ. ఈ సినిమా Netflix స్ట్రీమింగ్ అవుతుంది.