Rashmika Mandanna About Trolls On Animal Movie: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీతో రణబీర్ కపూర్‌కు కెరీర్‌లోనే పెద్ద హిట్ అందింది. అలాగే రష్మిక మందనాకు కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. కానీ ‘యానిమల్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం రష్మిక పాత్ర అలా ఉంటుంది అని ప్రేక్షకులు ఊహించలేదు. ట్రైలర్‌లో తను చెప్పిన ఒక డైలాగ్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత అది ఎంత ముఖ్యమైన సీన్ అని అందరికీ అర్థమయ్యింది. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై రష్మిక స్పందించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Producer Dil Raju Respond on Trolls on Second Marriage:  టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో 'దిల్‌' రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన 'గేమ్‌ ఛేంజర్‌', 'ఫ్యామిలీ స్టార్‌' వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఆయన తన సోదరుడు శిరీష్‌తో కలిసి నిర్మించిన 'ఫ్యామిలీ స్టార్‌' మూవీ నేడు థియేటర్లో రిలీజ్‌ అయ్యిం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. అయితే నిన్నటి వరకు ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు 'దిల్‌' రాజు. ఈ నేపథ్యంలో పలు చానళ్లకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యారు దిల్‌ రాజు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Vijay Deverakonda's Family Star Movie Review: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఫ్యామిలీ స్టార్'. బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం' తర్వాత వాళ్లిద్దరూ చేసిన చిత్రమిది. ఇందులో 'సీతా రామం', 'హాయ్ నాన్న' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. 'దిల్' రాజు నిర్మాత. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. ఇటీవల హీరో అంటే లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టు దర్శక రచయితలు వాళ్ల క్యారెక్టర్లు డిజైన్ చేస్తున్నారు. స్టార్ హీరోలను కామన్ మ్యాన్ క్యారెక్టర్లలో చూపించడం అరుదు అయిపోయింది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండను మిడిల్ క్లాస్ కుర్రాడిగా చూపిస్తూ పరశురామ్ 'ఫ్యామిలీ స్టార్' తీశారు. టీజర్, ట్రైలర్, పాటలు చూసినప్పుడు... కథ కంటే ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా కనిపించాయి. మరి, 'ఫ్యామిలీ స్టార్'లో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? రొమాన్స్ ఎలా ఉంది? కామెడీ సంగతి ఏంటి? అనేది చూస్తే.. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) 


Ananya Nagalla Tantra Movie Now Streaming on AHA: 'వకీల్‌ సాబ్‌' ఫేం అన‌న్య నాగళ్ల (Ananya Nagalla) కీలక పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర'(Tantra Movie). పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ గత నెల మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందుకు ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం థియేటర్లో ఆశించిన రస్పాన్స్‌ అందుకోలేకోపోయింది. భయపెట్ట సినిమా అంటూ చిన్న పిల్లలను మా సినిమాకు తీసుకురావద్దంటూ హైప్‌ క్రియేట్‌ చేశారు. భయపెట్టే విధంగా అన్ని హారర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నా ఎందుకో ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. థియేటర్లో రిలీజ్‌ అయ్యి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్‌లో ఆకట్టుకులేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమాయణం గురించి చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరు కలిసి నటించి తొలి సినిమా నుంచే లవ్ ట్రాక్ నడుపుతున్నారని టాక్ నడుస్తున్నది. ఈ వార్తల గురించి ఇటు రష్మిక గానీ, అటు విజయ్ గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అవును అని చెప్పలేదు. అలాగని ఖండించనూ లేదు. మీడియా నుంచి తమ ప్రేమాయణం గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా దాటవేస్తూ వస్తున్నారు. అయితే, వీరిద్దరు కలిసి ప్రేమలో ఉన్నారని, కలిసి వెకేషన్లకు వెళ్తున్నారని చాలా సార్లు రుజువు అయ్యింది. ఇద్దరు కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను నెటిజన్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. తాజాగా రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమెతో కలిసి విజయ్ దుబాయ్ లో సరదాగా గడుపుతున్నట్లు వెల్లడి అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)