Rashmika Mandanna-Vijay Deverakonda Love: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమాయణం గురించి చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరు కలిసి నటించి తొలి సినిమా నుంచే లవ్ ట్రాక్ నడుపుతున్నారని టాక్ నడుస్తున్నది. ఈ వార్తల గురించి ఇటు రష్మిక గానీ, అటు విజయ్ గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అవును అని చెప్పలేదు. అలాగని ఖండించనూ లేదు. మీడియా నుంచి తమ ప్రేమాయణం గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా దాటవేస్తూ వస్తున్నారు. అయితే, వీరిద్దరు కలిసి ప్రేమలో ఉన్నారని, కలిసి వెకేషన్లకు వెళ్తున్నారని చాలా సార్లు రుజువు అయ్యింది. ఇద్దరు కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను నెటిజన్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. తాజాగా రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమెతో కలిసి విజయ్ దుబాయ్ లో సరదాగా గడుపుతున్నట్లు వెల్లడి అయ్యింది. ఇద్దరు పెట్టిన సోషల్ మీడియా ఫోటోల ఆధారంగా నెటిజన్లు ఈ విషయాన్ని పసిగట్టారు. రెండు ఫోటోల్లో నెమలి కామన్ గా కనిపించడంతో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.   


మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి- రష్మిక


అటు తాజాగా రష్మిక మందన్న.. నేహా ధూపియా టాక్ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందులో విజయ్ తో సినిమాలు, ఆయనతో స్నేహం, ప్రేమ గురించి పలు అంశాలను చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ, తన ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని వివరించింది. “ఇద్దరం ‘డియర్ కామ్రేడ్’, ‘గీతా గోవిందం’ సినిమాలు చేశా. మేం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అలా ఉండటాన్ని నేను ఇష్టపడుతున్నాను. ప్రేమిస్తున్నాను” అని చెప్పింది. ఇక అతడిలో నచ్చని విషయం ఏంటో కూడా రష్మిక వివరించింది. “విజయ్ అన్ని వేళలో చాలా సీరియస్ గా ఉంటాడు. ఎప్పుడూ తన వర్క్ గురించే ఆలోచిస్తుంటారు” అని వివరించారు. ఇక విజయ్ ని తాను విజ్జు అని పిలులస్తానని చెప్పింది. అంతేకాదు, తన మిగతా ఫ్రెండ్స్ తో పోల్చితే విజయ్ ఇచ్చే సలహాలు చాలా బెస్ట్ గా ఉంటాయని చెప్పింది. 






దుబాయ్ వేదికగా పుట్టిన రోజు వేడుకలు


ఇక రష్మిక తన బర్త్ డే(ఏప్రిల్ 5) వేడుకలను దుబాయ్ లో జరుపుకోబోతోంది. ఇప్పటికే ఈ వేడుకల కోసం అక్కడికి వెళ్లింది. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా దుబాయ్ కి వెళ్లారు. అక్కడ ఇద్దరు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీరి ఫోటోల్లో బ్యాగ్రౌండ్ తో పాటు నెమలి కూడా కామన్ గా కనిపించింది. దీంతో ఇద్దరూ అక్కడే ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  


ఇక విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రష్మిక పుట్టిన రోజైన ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలోనూ ఆయన నటించబోతున్నారు.  రష్మిక ‘పుష్ప: ది రూల్’, ‘ది గర్ల్ ఫ్రెండ్, ‘రెయిన్ బో’, ‘చావా’ సినిమాల్లో నటిస్తోంది.  


Read Also: రష్మిక బర్త్ డే ట్రీట్ - 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ లుక్ రిలీజ్, ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న 'యానిమల్' బ్యూటీ!