Ranbir Kapoor New Bentley Continental GT: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తన ఇంటికి కొత్త బెంట్లీ కారును తీసుకువచ్చాడు. రణబీర్ కపూర్ ఇటీవలే బెంట్లీ కాంటినెంటల్ జీటీని కొనుగోలు చేశారు. ఇది బెంట్లీ విడుదల చేసిన 2 డోర్ 4 సీటర్ కారు. రణ్‌బీర్ కూడా ఇటీవలే తన కొత్త కారులో తిరుగుతూ కనిపించాడు. ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. రణబీర్ కొత్త తరం రేంజ్ రోవర్‌ను గతేడాది ఆగస్టు నెలలోనే తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ నటుడి కలెక్షన్‌లో మరో లగ్జరీ కారు బెంట్లీ చేరింది.






రణబీర్ కపూర్ బ్లూ సఫైర్ షేడ్‌లో బెంట్లీ కాంటినెంటల్ జిటిని కొనుగోలు చేశాడు. రణబీర్ కపూర్ ఈ కారును కస్టమైజ్ చేయడానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఈ 2 డోర్ల కారు ట్విన్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు జ్యుయల్ థీమ్‌తో కూడిన ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ బెంట్లీ కారు క్యాబిన్ కొత్త టెక్నాలజీతో అందుబాటులో ఉంది. దాని లగ్జరీ రూపాన్ని కొనసాగించడానికి బెంట్లీ ఈ వాహనం క్యాబిన్‌ను లెదర్ అప్హోల్స్టరీ, వెనీర్‌లతో తయారు చేసింది. అలాగే కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు అందించారు.


Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!


బెంట్లీ కాంటినెంటల్ జీటీ ఫీచర్లు
కంపెనీ ఈ కారులో బెంట్లీ రొటేటింగ్ డిస్‌ప్లేను అందించింది. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కస్టమైజ్ చేయవచ్చు. ఈ కారులో యాపిల్ కార్ ప్లేతో పాటు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. యూఎస్‌బీ-సీ ఛార్జింగ్ పాయింట్లు, వైఫై హాట్‌స్పాట్, రిమోట్ యాక్సెస్, అడాప్టివ్ క్రీజ్ కంట్రోల్, లేన్ డిటెక్షన్, అటానమస్ పార్కింగ్, నైట్ విజన్ కెమెరా వంటి అనేక గొప్ప ఫీచర్లు కాంటినెంటల్ జీటీలో అందించారు.


ఈ బెంట్లీ కారులో 4.0 లీటర్ వీ8 ఇంజన్‌ను కంపెనీ అందించారు. బెంట్లీ కాంటినెంటల్ జీటీ ఏకంగా 542 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. అలాగే 770 ఎన్ఎం పీక్ టార్క్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ జీటీ నాలుగు సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 318 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారును హైస్పీడ్ డ్రైవింగ్ కోసం రూపొందించారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఈ కారును తన కలెక్షన్‌లో చేర్చుకున్నాడు. బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.23 కోట్ల నుంచి రూ. 8.45 కోట్ల వరకు ఉంది. 


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!