CTET Application: సీటెట్‌(జులై)-2024 దరఖాస్తుకు నేటితో ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి

CTET 2024 Application: సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) దరఖాస్తు గడువు నేటితో (ఏప్రిల్ 5) ముగియనుంది.

Continues below advertisement

CTET 2024 Application: సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) దరఖాస్తు గడువు నేటితో (ఏప్రిల్ 5) ముగియనుంది. అభ్యర్థులు ఏప్రిల్ 5న రాత్రి 11.59 గంటల్లోపు నిర్ణీత ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది రెండుసార్లు (జులై, జనవరి) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. 

Continues below advertisement

వివరాలు..

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జులై 2024

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం..

✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు...

➥ సీటెట్ జులై 2023 నోటిఫికేషన్ వెల్లడి: 07.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 02.04.2024 (23:59hrs) (05.04.2024 వరకు పొడిగించారు)

➥ దరఖాస్తుల సవరణ: 08.04.2024 - 12.04.2024.

➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి రెండురోజుల ముందు నుంచి. 

➥ పరీక్ష తేదీ: 07.07.2024.

➥ ఫలితాల వెల్లడి: 2024, ఆగస్టు చివరివారంలో.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola