Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (శుక్రవారం, 05 ఏప్రిల్‌ 2024) మిక్స్‌డ్‌గా ఓపెన్‌ అయింది. సెన్సెక్స్ లాభాలతో ప్రారంభం కాగా, నిఫ్టీ నష్టంతో ట్రేడ్‌ స్టార్ట్‌ చేసింది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ కీలకమైన 74,000 స్థాయి నుంచి కిందకు పడింది, 73,946.92 దగ్గర ఇంట్రాడే లో లెవెల్‌ను టచ్‌ చేసింది. ఆ తర్వాత పుంజుకున్న బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌, తిరిగి 74,000 స్థాయి పైకి వచ్చింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 74,502 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 59.39 పాయింట్ల పెరుగుదలతో 74,287.02 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 22,515 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 28.25 పాయింట్లు లేదా 0.13 శాతం పడిపోయి 22,486.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ అతి స్వల్పంగా తగ్గాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 5 షేర్లు మాత్రమే గ్రీన్‌ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 25 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్ ఎం, నెస్లే, కోటక్ మహీంద్ర బ్యాంక్, పవర్ గ్రిడ్ ఉన్నాయి. పతనమవుతున్న సెన్సెక్స్ షేర్లలో.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లో 18 షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన 32 స్టాక్స్‌ పతనావస్థలో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో... డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ముందంజలో ఉందిస, 1.84 శాతం లాభపడింది. ఎస్‌బీఐ లైఫ్ 1.27 శాతం, సిప్లా 0.66 శాతం చొప్పున పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.64 శాతం, ఎం అండ్ ఎం 0.56 శాతం చొప్పున బలపడ్డాయి.


రంగాల వారీగా చూస్తే... ఫైనాన్షియల్స్‌, మెటల్‌ షేర్లు పతనానికి నాయకత్వం వహిస్తున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 1% పడిపోయింది. ఆటో 0.4% తగ్గింది. 


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, బీఎస్ఈలో మొత్తం 3,103 షేర్లు ట్రేడ్ అవుతుండగా... వాటిలో 1,512 షేర్లలో క్షీణత కనిపించింది. 1,467 షేర్లు పుంజుకున్నాయి. 124 షేర్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. 167 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 36 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. 114 స్టాక్స్‌ 52 వారాల గరిష్ట స్థాయికి, 4 స్టాక్స్‌ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.


ఈ రోజు ఉదయం 10.05 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 136.70 పాయింట్లు లేదా 0.18% తగ్గి 74,090.93 దగ్గర; NSE నిఫ్టీ 40.30 పాయింట్లు లేదా 0.18% తగ్గి 22,474.35 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమవుతుందన్న అంచనాలపై ఫెడ్ అధికారులు హెచ్చరించడం, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పడంతో US మార్కెట్‌లో ట్రెండ్‌ తారుమారైంది. అమెరికన్‌ ఇండెక్స్‌లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. ఈ రాత్రికి వెలువడే జాబ్ రిపోర్ట్‌ మీదకు ఇప్పుడు ఫోకస్‌ మారింది.


అమెరికన్‌ మార్కెట్లలో.. S&P 500, డౌ జోన్స్, నాస్‌డాక్ తలా 1 శాతానికి పైగా పడిపోయాయి. 


ఆసియా మార్కెట్లలో నికాయ్‌ 2.5 శాతం, కోస్పి 1.3 శాతం, ASX200 0.9 శాతం, హాంగ్ సెంగ్ 0.6 శాతం పతనమయ్యాయి.


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.312 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $91 చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,290 దగ్గర ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: డీమార్ట్‌ షేర్లకు 'బయ్‌' రేటింగ్‌, ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు