Ananya Nagalla Tantra Movie Now Streaming on AHA: 'వకీల్‌ సాబ్‌' ఫేం అన‌న్య నాగళ్ల (Ananya Nagalla) కీలక పాత్రలో నటించిన చిత్రం 'తంత్ర'(Tantra Movie). పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ గత నెల మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందుకు ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం థియేటర్లో ఆశించిన రస్పాన్స్‌ అందుకోలేకోపోయింది. భయపెట్ట సినిమా అంటూ చిన్న పిల్లలను మా సినిమాకు తీసుకురావద్దంటూ హైప్‌ క్రియేట్‌ చేశారు. భయపెట్టే విధంగా అన్ని హారర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నా ఎందుకో ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. థియేటర్లో రిలీజ్‌ అయ్యి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్‌లో ఆకట్టుకులేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది.


ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదు హాడావుడి లేకుండ సైలెంట్‌గా 'తంత్ర'ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ (Tantra OTT Release) ఇచ్చేసింది. తంతంక డిజిటల్‌ రైట్స్‌ను ఆహా (AHA) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు మూవీకి ఉన్న బజ్‌ చూసి మంచి ఫ్యాన్సీ డీల్‌కు కుదర్చుకుందని సమాచారం. చెప్పినట్టుగా నేడు (ఏప్రిల్‌ 5) మూవీని విడుదల చేసింది ఆహా. ఈ క్రమంలో నేడు అర్ధరాత్రి నుంచి మూవీ స్ట్రీమింగ్‌కు ఇచ్చేసింది. ఇక థియేటర్లో మిస్‌ అయినవారు ఓటీటీలో 'తంత్ర' చూసి ఎంజాయ్‌ చేయండి. ఈ సినిమాలో అనన్య నాగళ్లతో పాటు ఒకప్పటి హీరోయిన్ సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్షణ్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవి చైతన్యలు సినిమాను నిర్మించారు. 






తంత్ర కథ విషయానికి వస్తే..


రేఖ (అనన్యా నాగళ్ల) తల్లిని చిన్నతనంలో కోల్పోయిన ఆమె తండ్రితో ఎప్పుడూ తిట్లు తింటుంది. చిన్నప్పటి నుంచి స్నేహితుడైన తేజా (ధనుష్ రఘుముద్రి) అంటే రేఖకు ప్రేమ. అతడికి కూడా రేఖ పిచ్చి అభిమానం. అయితే రేఖ మీద ఎవరో క్షుద్రపూజలు చేశారని తెలుసుకుంటాడు తేజూ. దీంతో రేఖను దాని నుంచి కాపాడేందుకు అతడు ఏం చేశాడు. రేఖపై క్షుద్రపూజలు చేసిందేవరు తెలుసుకోవాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.  అయితే ఇందులో రేఖకు దయ్యాలు కనిపించడమనే ఆసక్తికర పాయింట్ తీసుకున్నాడు డైరెక్టర్. ప్రతి పౌర్ణమి నాడు రక్తదాహంతో తపించే ఆత్మ / పిశాచి రేఖ దగ్గరకు ఎందుకు వస్తుంది? 18 ఏళ్లు ఊరికి దూరంగా ఉన్న విగతి ('టెంపర్' వంశీ), మళ్లీ  వచ్చిన తర్వాత రేఖకు కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? రాజేశ్వరి (సలోని) ఎవరు? వజ్రోలి రతిని ఎవరు ఎవరి మీద ప్రయోగించారు? రేఖను కాపాడటం కోసం తేజా ఏం చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.



Also Read: రష్మిక బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది - 'పుష్ప 2' నుంచి శ్రీవల్లి లుక్‌ అవుట్‌, ఏంటీ ఇంత సీరియస్‌గా ఉంది!