Producer Dil Raju Respond on Trolls on Second Marriage:  టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో 'దిల్‌' రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన 'గేమ్‌ ఛేంజర్‌', 'ఫ్యామిలీ స్టార్‌' వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఆయన తన సోదరుడు శిరీష్‌తో కలిసి నిర్మించిన 'ఫ్యామిలీ స్టార్‌' మూవీ నేడు థియేటర్లో రిలీజ్‌ అయ్యిం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. అయితే నిన్నటి వరకు ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు 'దిల్‌' రాజు. ఈ నేపథ్యంలో పలు చానళ్లకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యారు దిల్‌ రాజు.

Continues below advertisement


'ఫ్యామిలీ స్టార్' ప్రెస్ మీట్ లో..


ఈ సందర్భంగా గతంలో రెండో పెళ్లి టైం ఆయన ఎదుర్కొన్న ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. అలాంటివి వస్తే ఎవరైన లో అవుతారు. మరి మీరు ఎలా వాటిని అధిగమించారు అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు. దీనికి ఆయన ఆసక్తికర రితీలో స్పందించారు. "నాకు అసలు మిమ్స్‌ అంటేనే తెలియదు. ఇలా సోషల్‌ మీడియాలో మిమ్స్‌ ఉంటాయా? అన్న విషయం తెలిసేది కాదు. అయితే, నా పెళ్లి తర్వాత ఓ చానల్‌ ఇంటర్య్వూ అడిగితే ఇచ్చాను. అందులో నా భార్య తేజస్వీని ఎలా కలిశాను, మేమిద్దరం ఎలా కనెక్ట్‌ అయ్యాం అనేది చెప్పాను. ఆ వీడియోకి కొన్ని మిమ్స్‌ వచ్చాయి. 'అబ్బా మామా మస్తు కొట్టినవే.. లక్కీ' అంటూ ట్రోల్‌ చేశారు. వాటిని నా భార్య చూపించి బాధపడింది. నేను చూసి అయితే ఏమైంది అన్నాను. భారతదేశంలో ఉన్న ఇన్ని కోట్ల జనాభాలో చాలా తక్కువ మందికి నేను తెలుసు. 






ట్రోలర్స్ కి 'దిల్' రాజు కౌంటర్


మన తెలుగు రాష్ట్రాల్లో నేను నిర్మాతని అని గుర్తు పెట్టేవాళ్లు ఒక కోటి వరకు ఉండోచ్చు. నాపై కామెంట్స్‌ పెట్టేవాళ్లు వెయ్యి.. రెండు వేలు, మరి అంటే పదివేలు ఉంటారేమో. అంతకు మించి అయితే దాటరు కదా. కాబల్లి వాళ్ల గురించే ఆలోచిస్తే మిగిలిన వారికి దూరం అవుతాం. ప్రస్తుతం మనం నెగిటివ్‌ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లోనూ అలాగే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే అరోగ్యం పాడు చేసుకుంటుననాం. అందుకే నెగిటివిటీ మన దగ్గరికి రానివ్వకూడదు.  అవన్ని కేవలం పాసింగ్‌ క్లౌడ్స్‌ లాంటివి. అవి నన్ను చంపేయలేవు కదా. పాసింగ్‌ క్లౌడ్స్‌ మనకు ఆకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. కాబట్టి.. ఇలాంటి నెగిటివిటిని పట్టించుకోవద్దు. మన ఆకాశం లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కి భయపడతామా" అంటూ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2018లో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఆయన 2020 లాక్‌డౌన్‌లో తేజస్వీని సీక్రెట్‌గా రెండో పెళ్లీ చేసుకున్నారు. వీరికి 29 జూన్‌ 2022ను కుమారుడు అన్వి రెడ్డి జన్మించాడు.


Also Read: ఓటీటీకి వచ్చేసిన తెలుగు హార్రర్‌ థ్రిల్లర్‌ 'తంత్ర' - అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!