Shiv Priyanka Marriage In Maa Inti Pandaga: బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడే ప్రియాంక జైన్.. తన కో స్టార్ శివ్‌తో తన రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేసింది. అంతకు ముందు వరకు వీరు కూడా చాలామంది రీల్ కపుల్స్‌లో ఒకరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా కాదని, వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని అనౌన్స్ చేశారు. అప్పటినుండి ప్రియాంక, శివ్.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా వీరి యూట్యూబ్ ఛానెల్ అయిన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్‌’లో పెళ్లి బట్టల్లో కనిపించి.. ‘‘మా పెళ్లి అయిపోయింది’’ అని అనౌన్స్ చేసి షాకిచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Pushpa 2 teaser Launch on Allu Arjun Birthday: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే అనే విషయం తెలిసిందే. ఈ స్పెషల్‌ డే రోజున ఫ్యాన్స్‌ కోసం పుష్ప 2 టీం ఎలాంటి సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిందా? అని ఫ్యాన్స్‌ అంత క్యూరియసిటిగా ఉన్నారు. ఈ చిత్రం ఎలాంటి అప్‌డేట్‌ వస్తందా అని ఆసక్తికగా ఎదుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 టీం అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. అంతా ఊహించిననట్టుగానే బన్నీ బర్త్‌డే అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకే మేకర్స్‌ భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రోజు పుష్ప 2 టీజర్‌ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కి మాస్‌ జాతర చూపించబోతున్నారట. ఇదే విషయాన్ని కన్‌ఫాం చేస్తూ తాజాగా దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చేసింది మూవీ టీం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'విశ్వంభర' లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' (Vishwambhara Movie). సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఇది. దీనికి వశిష్ఠ మల్లిడి దర్శకుడు. బ్లాక్ బస్టర్ 'బింబిసార' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


Jr NTR Spotted at Khairatabad RTO Office Video: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌ షెడ్యూల్‌కి రెడీ అవుతున్న తరుణంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లో సందడి చేశాడు. తాజాగా ఆయన హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్టీవో ఆఫీసులో దర్శనం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో (Jr NTR RTO Office Visuals)నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో తారక్‌ ఆర్టీవో ఆఫీసు (RTO Office) నుంచి బయటకు వస్తు కనిపించాడు. అంతేకాదు ఆర్టీవో అధికారులతో మాట్లాడిన అనంతరం కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆఫీసుకి తన బ్రాండ్ న్యూ కారులో వచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఫుల్ బిజీ. ఇప్పుడు ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఆయన 35వ సినిమా 'మనమే' త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అది కాకుండా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా (Sharwanand 37 Movie) చేయనున్నారు. అందులో ఓ సినిమాకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)