Shiv Priyanka Marriage In Maa Inti Pandaga: బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పుడే ప్రియాంక జైన్.. తన కో స్టార్ శివ్‌తో తన రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేసింది. అంతకు ముందు వరకు వీరు కూడా చాలామంది రీల్ కపుల్స్‌లో ఒకరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా కాదని, వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని అనౌన్స్ చేశారు. అప్పటినుండి ప్రియాంక, శివ్.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా వీరి యూట్యూబ్ ఛానెల్ అయిన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్‌’లో పెళ్లి బట్టల్లో కనిపించి.. ‘‘మా పెళ్లి అయిపోయింది’’ అని అనౌన్స్ చేసి షాకిచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.


కుటుంబ సభ్యుల సమక్షంలో..


ప్రియాంక, శివ్ కలిసి వారి పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగినా.. తమ యూట్యూబ్ ఛానెల్ అయిన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్‌’లో అప్లోడ్ చేస్తుంటారు. అలాగే తాజాగా వారిద్దరూ పెళ్లి బట్టల్లో కనిపించి షాకిచ్చారు. అంతే కాకుండా వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోలో కనిపించడంతో నిజంగానే ఈ ఇద్దరికీ పెళ్లి అయిపోయిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఫాలోవర్స్‌కు సారీ కూడా చెప్పాడు శివ్. అసలు వారు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? ఎక్కడ చేసుకున్నారు? ఎలా జరిగింది అనే విశేషాలను త్వరలోనే అందరితో పంచుకుంటామని తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన అన్నీ వీడియోలను అప్లోడ్ చేస్తామని మాటిచ్చాడు శివ్. అయితే వీరిద్దరూ స్టార్ మా నిర్వహించిన ఉగాది ఈవెంట్‌లో స్టేజ్‌పైనే పెళ్లి చేసుకున్నారని తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.



ఇదే సమాధానం..


ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడానికి స్టార్ మా కుటుంబం అంతా ఒక్కచోట కలిసింది. ‘మా ఇంటి పండగ’ పేరుతో బుల్లితెరకు చెందిన 10 కుటుంబాలు సంతోషంగా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అందులో ప్రియాంక, శివ్‌ల కుటుంబం కూడా ఒకటి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందరితో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రియాంక ప్రకటించింది. అందరూ తమ కుటుంబ సభ్యులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ హ్యాపీ చేయగా.. ఫైనల్‌గా ఈ ప్రోమో చివర్లో ప్రియాంక, శివ్ పెళ్లి పండగ జరిగింది. ‘‘శివ్, ప్రియాంక పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఇదే సమాధానం’’ అంటూ శ్రీముఖి ప్రకటించింది. ఈ ఈవెంట్ వివరాలు ఏమీ చెప్పకుండా అదే వీడియోను వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు శివ్, ప్రియాంక.


గంగవ్వకు సన్మానం..


స్టార్ మా నిర్వహించిన ‘మా ఇంటి పండగ’ ఈవెంట్‌కు స్పెషల్ గెస్టులుగా విజయ్ దేవరకొండ, దిల్ రాజు కుటుంబం, అంజలి, రాశి సింగ్ వచ్చినట్టుగా ప్రోమోలో చూపించారు. అక్కడ ఉన్న బుల్లితెర భామలతో విజయ్ స్టెప్పులు కూడా వేశాడు. ‘‘ఈసారి మా ఇంటి పండగ ఆటలతో కాదు ఆప్యాయతలతో నిండిపోతుంది’’ అని ప్రకటించింది శ్రీముఖి. దానికి తగినట్టుగానే ఉగాది సందర్భంగా తమ కుటుంబ సభ్యులకు ఏదో ఒక విధంగా సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు బుల్లితెర సెలబ్రిటీలు. ఎక్స్‌ప్రెస్ హరి.. తన తల్లిదండ్రులను ఫ్లైట్ ఎక్కించగా.. టేస్టీ తేజ తన తల్లిని నాగార్జున దగ్గరకు తీసుకెళ్లాడు. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో గంగవ్వకు స్పెషల్‌గా సన్మానం చేసినట్టు కూడా ప్రోమోలో చూపించారు.



Also Read: న‌టి శ‌ర‌ణ్య పొనన్వ‌న్న‌న్ పై కేసు న‌మోదు