Satyabhama Today Episode క్రిష్, సత్య ఇద్దరూ కలిసి పూజ చేసి దేవుడికి ముడుపు సమర్పిస్తారు. తన ప్రేమని సత్య తెలుసుకొని తనని తన భార్యని ఒకటి చేసి ముడుపు ఫలించే బాధ్యత నీదే అని దేవుడిని క్రిష్ కోరుకుంటాడు. ఇక సత్యని తన అక్క రేణుక పాట పాడమని చెప్తుంది. 


సత్య ఆలోచిస్తే క్రిష్ పాడమని సైగ చేస్తాడు. దీంతో సత్య ఓం సర్వాణి.. ఓం రుద్రాణి.. వందనం అంటూ పాడుతుంది. క్రిష్ సత్యని చూస్తూ మైమరచిపోతాడు. అందరూ చక్కగా పాడావని సత్యని పొగిడేస్తారు. సత్య పూజ పూర్తి చేసి క్రిష్‌తో పాటు అందరికీ హారతి ఇస్తుంది. తర్వాత ఇద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. మహదేవయ్య సంవత్సరం లోపు తనకు మనవడిని ఇవ్వాలని అంటాడు. సత్య క్రిష్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. 


మరోవైపు శాంతమ్మ తనకు సత్య గుర్తొస్తుంది అని విశాలాక్షికి చెప్తుంది. ఫోన్‌ చేసి మాట్లాడాలని ఉందని అంటుంది. అయితే విశాలాక్షి వద్దు అనేస్తుంది. ఎందుకు అని సంధ్య అడగడంతో అత్తింటి వార్తలు పుట్టింటికి చేర్చుతుందని అంటారని.. ఏవేవే చెప్తుంది. ఇంతలో నందిని నిద్ర లేస్తుంది. 


నందిని: గదిలో నుంచి అరుస్తున్నా ఎవరూ పలకరేంటి.
శాంతమ్మ: నీకు నోరు తప్ప కాళ్లు పని చేయవా ఏంటి. నోరు పెట్టి అరిచే బదులు ఏం కావాలో హాల్ లోకి వచ్చి అడగొచ్చుగా. 
నందిని: నాకు బ్రష్ పేస్ట్ కావాలి.
సంధ్య: ఇస్తే సరిపోతుందా.. వచ్చి బ్రష్ కూడా చేయించాలా. ఒకసారి నిద్ర మత్తు వదులించుకొని చూడు వదినా ఇది మీ బంగ్లా కాదు అత్తిళ్లు. ఇక్కడ పనే ఉంటుంది. పని వాళ్లు ఉండరు. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. 
శాంతమ్మ: తను నా కోడలు తెళ్లారగానే అత్తగారి కోసం కాఫీ తీసుకొని వచ్చింది. దీని బట్టి నీకు ఏమర్థమైంది.
నందిని: నాకు కూడా కాఫీ తీసుకొని వస్తుందని.. కాఫీ నాకు స్ట్రాంగ్‌గా కావాలి. 
విశాలాక్షి: నువ్వు వెళ్లి ఫ్రెష్ అయిరా అమ్మ నేను టిఫెన్ చేస్తా.. 
నందిని: నాకు చికెన్ దోశ కావాలి.
శాంతమ్మ: ఇంత పొద్దున్న చికెనా..
విశాలాక్షి: నేను చేస్తాలే అమ్మ నువ్వు వెళ్లు..
సంధ్య: అమ్మ నాకు మసాలా రవ్వ దోశ కావాలి. 
శాంతమ్మ: చేసి పెడుతుందిలే అమ్మ కోడలికే చేసినప్పుడు కూతురికి చేసి పెట్టదా ఏంటి. కోడల్ని ప్రేమగా చూడు కాదనడం లేదు. గారాభంగా ఎందుకే.. తప్పులు చేస్తున్నా తప్పుగా మాట్లాడుతున్నా సరిదిద్దు తప్పులేదు. కూతుర్ని ఒక మాట అనవా ఏంటి.
విశాలాక్షి: కూతుళ్లు వేరు కోడలు వేరు అత్తయ్య కూతుళ్లని ఒక మాట అనే స్వేచ్ఛ ఉంటుంది. కానీ కోడలి విషయంలో అలా కాదు కదా.. మొదటి రోజు నుంచే అత్త అమ్మ అవ్వలేదు. పైగా నందిని పెరిగిన వాతావరణం వేరు అప్పటి వరకు సర్దుకోవాలి తప్పుదు.
శాంతమ్మ: కానీ కొద్ది రోజులు సర్దుకుపోతావో జీవితాంతం సర్దుకుంటావో చూద్దాం..


క్రిష్:  ఏంటి అక్కడ ముడుపు కట్టామనా ఇక్కడ బెడ్ సర్దుతున్నావ్.. నేనేమైనా సాయం చేయనా..
సత్య: ఇంట్లో గొడవ జరగడం ఇష్టం లేక కోడలిగా ముడుపు పూజలో కూర్చొన్నా అంతే కానీ మనసు మారి కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు. మనుషుల్లో నిజాయితీ లేకపోయినా రూం నీటిగా లేకపోయినా నాకు నచ్చదు. అందుకే సర్దుతున్నా..
క్రిష్: ఇంట్లో అందరి ముందు నీకు సపోర్ట్ చేశా.. థ్యాంక్స్ చెప్తావేమో ఖుషీగా ఫీలవుదాం అనుకున్నా.. మొగుడికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అందామనుకున్నా..
సత్య: హలో ఈ గది బయటే మనం మొగుడు పెళ్లాలం ఇక్కడకాదు. 
క్రిష్: నాది నాటకం అన్నావు మోసం చేశాను అన్నావు మరి నువ్వు చేసేది ఏంటి నాటకం కాదా.. మా ఇంట్లో వాళ్లని మోసం చేయడం కాదా..


ఇంతలో బామ్మ, గంట, రేణుక వచ్చి సత్య పాట బాగా పాడింది అంటారు. ఇక క్రిష్ కావాలానే సత్యని ఇరికించేలా దేవుడు మా ముడుపు పూజని త్వరలోనే తీర్చుతాడు కదా అని బామ్మతో అడుగుతాడు. దానికి బామ్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనస్ఫూర్తిగా ముడుపు కట్టారు. వారసుడు రాకుండా ఎలా ఉంటాడని అంటుంది. దీంతో క్రిష్ సత్యని చూసి సైగ చేస్తాడు. సత్య మూతి తిప్పుతుంది. ఇక రేణుక పూజ అవ్వగానే గదిలోకి వచ్చేశారు. సత్య నీ కాళ్లకి మొక్కాలి నువ్వు దీవించాలి అని చెప్తుంది. ఇక సత్య నేను నిన్ను దీవించాలి అంట అని సత్యని ఇరికిస్తాడు. సత్య బుంగమూతి పెడుతుంది. అయిష్టంగానే సత్య క్రిష్ కాళ్లు పట్టుకొని దీవెనలు తీసుకుంటుంది. సత్య క్రిష్ కాలు గిల్లేస్తుంది. క్రిష్ అరుస్తాడు. ఏమైందని అందరూ అడగడంతో కవర్ చేస్తాడు.


క్రిష్: ఏమని దీవించానో తెలుసా మనద్దరం కలకాలం సంతోషంగా కలిసి ఉండాలని.
సత్య: మనసు మంచిది అయితే ఇచ్చే దీవెనలకు కూడా విలువ ఉంటుంది.
 
నందిని కోసం విశాలాక్షి చికెన్ చేస్తుంది. నందిని లొట్టలేసుకొని తింటుంటే విశాలాక్షి మురిసిపోతే శాంతమ్మ, సంధ్యలు చిరాకుగా చూస్తారు. నందిని తిండి చూసి శాంతమ్మ, సంధ్యలు సెటైర్లు వేసుకుంటారు. ఇక తాను తిన్న ప్లేట్ తనకే తీయమని చెప్పమని శాంతమ్మ విశాలాక్షికి చెప్తుంది. నందిని తనకి ప్లేట్ తీసే అలవాటు లేదు నేర్పించినా రాదు అని ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. దీంతో విశాలాక్షి ఎంగిలి తీస్తుంది. శాంతమ్మ తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 2nd: మరదలి విషయంలో బాంబ్ పేల్చిన కార్తీక్ - భర్త కోసం సీటీ వచ్చేసిన దీప!