Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: కార్తీక్ ఇంటికి వెళ్తాడు. తన తల్లిదండ్రులను కలిస్తాడు. ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతాడు. లండన్ నుంచి ఏం తీసుకొచ్చావు అని కార్తీక్ అను తన తండ్రి అడిగితే సిగరెట్ లైట్ ఇస్తాడు. ఇక కార్తీక్‌ను జ్యోత్స్నకు కలిసి మాట్లాడమని తల్లి చెప్తుంది. కార్తీక్ జ్యోత్స్న తల్లిదండ్రులను కలిస్తే వాళ్లు కూడా ముందు తన కూతుర్ని కలవమని చెప్తారు. ఇక పారిజాతాన్ని కలిసిన కార్తీక్ పారిజాతం కోసం లిప్‌స్టిక్ ఇస్తాడు. ఇక శివనారాయణ, పారిజాతం కూడా జ్యోత్స్నను కలవమని చెప్తారు. 


కార్తీక్: మనసులో.. జ్యోత్స్నను నేను కేవలం మరదలిగానే చూస్తున్నాను అది వీళ్లకి ఎలా చెప్పాలి. 
పారిజాతం: వెళ్లు కార్తీక్ అది నీ కోసం బెంగ పెట్టుకుంది వెళ్లు వెళ్లు. కార్తీక్ సరే అని తల ఊపి జ్యోత్స్న గదికి వెళ్తాడు. 


జ్యోత్స్న గదిలో తన బావ ఫొటో చూసుకుంటూ ఉండగా కార్తీక్‌ ఫోన్ తీసుకుంటాడు. కార్తీక్‌ మరదలికి గిఫ్ట్ ఇస్తాడు. ఇక జ్యోత్స్న నైట్ పార్టీ అయిందని అప్పుడు రింగ్ ఇచ్చి గౌతమ్ ప్రపోజ్ చేశాడు అని చెప్తుంది.


కార్తీక్: నువ్వేం చెప్పావు.
జ్యోత్స్న: నేను క్లియర్‌గా చెప్పేశా నాకు నా బావ ఇష్టం బావే నా భర్త అని .. నేవ్వేంమంటావ్ బావ.
కార్తీక్: కొన్ని సార్లు సమాధానం కూడా ప్రశ్నలలాగే మారిపోతాయి జ్యోత్స్న.
జ్యోత్స్న: అర్థమైంది బావ బావ అని కాకుండా భర్త అని చెప్పాల్సింది అంతేకదా.
కార్తీక్: అది కాదు జ్యోత్స్న.. నీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తర్వాత చెప్తా. మనసులో.. నువ్వు ఎప్పటికీ నాకు మరదలివే జ్యోత్స్న వేరే ఏ ఫీలింగ్స్ లేవు.


మరోవైపు దీప, సౌర్యలు రాత్రి రోడ్డు మీద హైదరాబాద్ వెళ్లడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సౌర్య త్వరగా వెళ్లి నాన్నని చూడాలి అని ఉందని అంటుంది. ఇక కారు రావడంతో దీప ఆపి ఎక్కుతుంది.  


కార్తీక్‌: చిన్నతనంలో దీప చైన్ పట్టుకని..  నా ప్రాణాలు కాపాడావు నువ్వు ఎలా మర్చిపోతాను చెప్పు. కళ్లు మూసుకుంటే నాకు గుర్తొచ్చేవి రెండే రెండు జ్ఞాపకాలు. ఒకటి నన్ను కాపాడిన నువ్వు. రెండు నన్ను క్షమించని దీప. దీప నన్ను ఎప్పుడు క్షమిస్తుందో తెలీదు. మేలు పొందిన మనిషి కృతజ్ఞతగా తిరిగి సాయం చేయకపోవడం ఎంత తప్పో. మన కారణంగా అన్యాయం జరిగిన మనిషికి తిరిగి సాయం చేయకపోవడం అంతే తప్పు. (గతంలో జరిగిన ఏదో యాక్సిడెంట్‌ను చిన్న ఫ్లాష్‌లా చూపిస్తారు.) ఈ రెండు తప్పులను నేను ఎలా సరిదిద్దుకుంటాను. 
జ్యోత్స్న: బావ నేను రెడీ పద వెళ్దాం. 
 
కార్తీక్, జ్యోత్స్నలు కలిసి పక్కపక్కనే నిల్చొంటే పారిజాతం వీడియో తీస్తుంది. ఇక కొత్త రెస్టారెంట్ పేరు ఏం పెడుతున్నావ్ అని శివనారాయణ అడిగితే జ్యోత్స్న అని తన నానమ్మ ఫొటో వంక చూసి కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న తన బావ తన మీద ప్రేమతో తన పేరు పెట్టాడు అని నేను అంటే నీకు ఎంత ఇష్టం బావ అని మురిసిపోతుంది. పారిజాతం కార్తీక్‌కు ఫోటోలు చూపిస్తుంది.


పారిజాతం: కార్తీక్ మీ జంట చూడు ఎంత చూడముచ్చటగా ఉందో. పెళ్లికి ముందే నువ్వు నీ భార్యకి రెస్టారెంట్ గిఫ్ట్‌గా ఇచ్చావు చూడు కార్తీక్ నువ్ సూపర్.
కార్తీక్: నీకో విషయం చెప్పాలి పారు.
పారిజాతం: ఈ సంతోషంలో నువ్వు ఎన్ని చెప్పినా ఓకే చెప్పు చెప్పు.
కార్తీక్: జ్యోత్స్నను నేను పెళ్లి చేసుకోలేను. తన మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. 
పారిజాతం: కార్తీక్ నువ్వు జోక్ చేస్తున్నావ్ కదా..
కార్తీక్: ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా.. తనని నేను మరదలిగా మాత్రమే చూస్తున్నా.
పారిజాతం: కార్తీక్ ఈ విషయం జ్యోత్స్నకు చెప్పావా. 
కార్తీక్: చెప్పడానికే బయటకు తీసుకెళ్తున్నాను.
పారిజాతం: వద్దు నువ్వు చెప్పకు. నేను చెప్తా.. చిన్నప్పటి నుంచి నిన్నే భర్తగా ఊహించుకొని బతుకుతుంది. నువ్వు చెప్తే సూసైడ్ చేసుకుంటుంది. నేనే టైం చూసుకొని దానికి అర్థమయ్యేలా చెప్తా. ఇలాంటి విషయాల్లో కంగారు పడితే అందరికీ మంచిదికాదు. ఇంతలో జ్యోత్స్న రావడంతో కార్తీక్ జ్యోత్స్న ఇద్దరూ బయటకు వెళ్తారు.
నా మనవరాలిని నీకు భార్యని చేసి ఈ యావత్ ఆస్తికి వారసురాలిని చేద్దామని నేను కలలు కంటుంటే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటావా. ఇదే మాట నువ్వు కాంచనకు చెప్పావు అంటే కొడుకుకి ఇష్టలేదు అని సరే అంటుంది. సుమిత్ర కూడా ఇష్టం లేని జంటను కలపాలి అని చూడదు. అదే జరిగితే నేను  అంత కష్టపడి బిడ్డల్ని మార్చడం వృథా అయినట్లే కదా. నువ్వు అనుకున్నది ఏం జరగనివ్వను కార్తీక్. నువ్వు నా మనవరాలిని పెళ్లి చేసుకోవాల్సిందే. దాన్ని కాదని నీ జీవితంలోకి వేరే ఏ ఆడదాన్ని రానివ్వను.


దీప, సౌర్యలు హైదరాబాద్‌ చేరుకుంటారు. సిటీలో కార్లు బిల్డింగ్‌లు, మెట్రో ట్రైన్లు చూసి సౌర్య తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ఇక దీప అంత పెద్ద మహానగరంలో నా భర్తను ఎలా వెతకాలి అని అనుకుంటుంది.


ఇక పారిజాతం అంతా తను అనుకున్నట్లు జరుతుంది అంటే కార్తీక్ నెత్తిమీద ఇంత పెద్ద బాంబ్ వేశాడేంటి అని ఆలోచిస్తుంది. కార్తీక్ అనుకున్నది జరగకూడదు అని గట్టిగానే ఫిక్స్ అవుతుంది. వర్క్ ఉందని కార్తీక్ బయటకు వెళ్తాను అంటే పారిజాతం జ్యోత్స్నను కూడా తీసుకెళ్లమని అంటుంది. ఇక కార్తీక్ పారిజాతాన్ని పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్నకు చెప్పావా అని అడుగుతాడు. అందంతా నేను చూసుకుంటానని పారిజాతం చెప్తుంది. ఇక జ్యోత్స్న బావతో నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తా అని అంటుంది. ఇక పారిజాతం వెంటనే ఏమైనా చేయకపోతే పెద్ద ప్రమాదం వచ్చేలా ఉందని అనుకుంటుంది. మరోవైపు దీప భర్త కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: 'త్రినయని' సీరియల్ ఏప్రిల్ 2nd: గాయత్రీదేవి జాడ కోసం పిండి పూజ.. సుమన బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతానన్న పెద్దబొట్టమ్మ!