Jr NTR Spotted at Khairatabad RTO Office Video: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ షెడ్యూల్‌కి రెడీ అవుతున్న తరుణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లో సందడి చేశాడు. తాజాగా ఆయన హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీవో ఆఫీసులో దర్శనం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో (Jr NTR RTO Office Visuals)నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో తారక్ ఆర్టీవో ఆఫీసు (RTO Office) నుంచి బయటకు వస్తు కనిపించాడు. అంతేకాదు ఆర్టీవో అధికారులతో మాట్లాడిన అనంతరం కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆఫీసుకి తన బ్రాండ్ న్యూ కారులో వచ్చాడు.
ఇక తారక్‌ను ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసు ముందు చూసి ఫ్యాన్స్ అంతా థ్రిల్ అవుతున్నారు. సామాన్య వ్యక్తిలా తారక్ ఇలా ఆర్టీవో ఆఫీసు ఎదుట కనిపించడంతో అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తారక్ ఆఫీసు నుంచి బయటకు నడుచుకుంటు తన బ్రాండ్ న్యూ కారు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ బ్లాక్ కారులో ఎక్కుతూ కనిపించాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ నేపథ్యంలోనే తారక్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ మరో కొత్త కారు కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కారు గ్యారేజ్ లు ఉన్నాయి. ఏడాది క్రితం తారక్ లంబోర్ఘిని కారు కొన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ తన కారు గ్యాలరీ చేర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక
కాగా దేవరలో ఎన్టీర్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ లేదు కానీ, ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ నటి శృతి మరాఠే చేసిన కామెంట్స్ ఈ రూమర్‌కి మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో దేవరలో తాను నటిస్తున్నానని, ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నట్టు చెప్పింది. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్ అనే విషయం ఆఫీషియల్ అయిపోయింది. ఇక ఆమె ఎన్టీఆర్ జోడిగా నటించానని చెప్పడంతో ఇది సీనీయర్ ఎన్టీఆర్ రోల్ అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే రెండు పార్టులుగా వస్తున్న దేవర మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక దీనితో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.