Siddhu Jonnalagadda Clarifies on Chiranjeevi Movie Offer Rejected: టిల్లు గాడు ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్‌' సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు. పైగా ఈ సినిమాను ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకోవడంతో మూవీ టీం అంతా పండగా చేసుకుంటుంది. యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన  ఈ రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ మార్చి 29 థియేటర్లోకి వచ్చింది. 2022 బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం విపరీతమైన బజ్‌ నెలకొంది. అలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ మించి ఉంది. సిద్ధూ మరోసాని తనదైన నటన, డైలాగ్స్‌లో మెస్మరైజ్‌ చేశాడు.


తొలి షో నుంచే ఈ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.68 కోట్లకు పైగా గ్రాస్ వసూళు చేసి వంద కోట్ల దిశగా పరుగులు పడుతుంది. సెకండ్‌ వీక్‌ ఎండ్‌లోపు ఈ చిత్రం వందకోట్ల క్లబ్‌లో షేర్‌ అవకాశం ఉందటున్నారు ట్రేడ్‌ పండితులు. దీంతో మూవీ టీం అంతా ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఈ యంగ్‌ హీరో సిద్ధూ మెగాస్టార్‌ చిరంజీవి మూవీ ఆఫర్‌ని రిజెక్ట్‌ చేశాడంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఇది నిజమా? ఉట్టి పుకారా? అనేది కూడా తెలియదు. రీసెంట్‌గ్‌ ఓ ఇంటర్య్వూలో స్వయంగా సిద్ధు క్లారిటీ ఇచ్చాడు. టిల్లు స్క్వేర్‌ మూవీ రిలీజ్‌లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ ప్రముఖ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు.


ఇందులో అతడికి చిరంజీవి మూవీ ఆఫర్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి సిద్ధూ అవును నిజమే అని చెప్పాడు. అవును. చిరింజీవి గారితో నటించే అవకాశం వచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది సెట్‌ కాలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అంటే అందరికి మొదట గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఆయన సూపర్‌ హ్యూమన్‌. అలాంటి హీరోతో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, ఆయనతో సినిమా అంటే వండర్‌ మూవీ కావాలి. ఆ సినిమా మరో ప్రపంచాన్ని చూపించాలి. ఆ ప్రాజెక్ట్‌ అవుట్‌ ఆఫ్‌ వరల్డ్‌ లాంటిది  అయ్యిండాలని నా ఆశ. చిరంజీవి గారితో కలిసి పనిచేశానని భవిష్యత్తులో నా పిల్లలకు నేను గర్వంగా చెప్పుకునేది అయ్యి ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అది కుదురుతుంది. చిరింజీవి గారితో నటించే అవకాశం నాకు మళ్లీ వస్తుందని ఆశిస్తున్నా.



మెగాస్టార్‌ స్టార్‌డమ్‌కు సమానంగా సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. అయినా, అలాంటి ఒక రోజులు రావాలి అని ఎదుచూస్తున్నా" అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ఆ తర్వాత సిద్ధూ మాట్లాడుతూ.. తాను విక్టరి వెంకేటేష్‌ ఫ్యాని అని చెప్పాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. "టాలీవుడ్‌ హీరోల్లో నాకు విక్టరీ వెంకటేష్‌ గారు అంటే చాలా ఇష్టం. ఆయన అన్న, ఆయన సినిమాలన్న నాకు పిచ్చి. అందుకే నాపై, నా సినిమాలపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయనే నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్‌. నా సినిమా కెరియర్‌పై ఆయన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అమితాబ్‌ బచ్చన్‌ గారు, రజనీకాంత్‌ గారు ఇలా టాప్‌ లెజండరీ హీరోలతో కలిసి పని చేయాలనేతి కూడా తన కోరిక" అని చెప్పాడు. 


Also Read: ఈ నెలలోనే 'గామి' ఓటీటీ రిలీజ్ - ZEE5లో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతుందంటే?