Alia Bhatt At Hope Gala: లండన్‌లోని హోప్ గాలా ఈవెంట్‌లో ఆలియా భట్ సందడి చేసింది. గత వారంలో జరిగిన ఈ ఈవెంట్‌కు ఆలియా హోస్ట్‌గా వ్యవహరించింది. సలామ్ బొంబే ఫౌండేషన్ తరపున ఇండియాలోని వెనుకబడిన వర్గాలలోని యువతీయువకులను సాయం చేయడానికి ఈ ఈవెంట్ ఏర్పాటయ్యింది. ఇప్పటికే సలామ్ బొంబే ఫౌండేషన్ ముంబాయ్‌లోని ఎంతోమంది చిన్నపిల్లలకు చదువు నేర్పించి, ప్రపంచం పట్ల వారికి ఒక అవగాహనను తీసుకొచ్చింది. చిన్నపిల్లలకు మాత్రమే కాకుండా యూత్‌కు కూడా ఈ ఫౌండేషన్ ఎంతో సాయం చేస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో ఆలియా హైలెట్‌గా నిలవగా.. అందులో తను ధరించిన నెక్లెస్ గురించి పలు రూమర్స్ బయటికొచ్చాయి.


ఫ్రాక్‌తో ఫిదా..


హోప్ గాలా ఈవెంట్‌లో ఆలియా స్టేజ్‌పై అడుగుపెట్టిన క్షణం నుండి ఆడియన్స్ అందరినీ ఫిదా చేస్తూనే ఉంది. మాటలతో మాత్రమే కాదు.. తన స్టైల్తో కూడా అందరినీ కట్టిపడేసింది. ముందుగా ఒక మెరూన్ కలర్ ఫుల్ ఫ్రాక్ ధరించిన ఆలియా భట్.. దానిపై ఒక చిన్న నెక్లెస్‌ను ధరించింది. అయితే ఈ నెక్లెస్ ఏదో బాగుంది. మాకు కూడా అలాంటిది కావాలి అంటూ సెర్చ్ చేసిన నెటిజన్లకు పెద్ద షాకే తగిలింది. ఆ నెక్లెస్ ధర అలాంటిది మరి! మహా అయితే లక్షల్లో ఉంటుందేమో అనుకుంటారు కానీ కాదు.. ఈ నెక్లెస్ ధర ఏకంగా కోట్లలో ఉంది. ప్రస్తుతం హోప్ గాలా ఈవెంట్‌లో ఆలియా ధరించిన నెక్లెస్ గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.


2.5 మిలియన్ డాలర్స్..


హోప్ గాలా ఈవెంట్‌లో మెరూన్ ఫ్రాక్‌పై బ్లూ డైమెండ్ నెక్లెస్‌ను ధరించింది ఆలియా. దాంతో పాటు మ్యాచింగ్ రింగ్‌ను కూడా పెట్టుకుంది. ఈ రెండూ ఇటలీకి చెందిన ప్రముఖ బల్గారీ బ్రాండ్‌కు చెందినవే. ఈ జ్యువలరీకి ఆలియా మొత్తంగా 2.5 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టిందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.20 కోట్లు. చూడడానికి సింపుల్‌గా ఉన్న ఈ నెక్లెస్ ధర రూ.20 కోట్లు అని తెలిసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. డైమండ్ నెక్లెస్ అయినా కూడా ఈ రేంజ్‌లో ధర ఊహించలేదని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఈవెంట్‌లో తను మెరూన్ కలర్ ఫ్రాక్‌తో పాటు క్రీమ్ కలర్ చీరను కూడా ధరించింది. మొత్తానికి ఆలియా భట్ ఛార్మ్‌తో ఈవెంట్‌లో అందరినీ తనవైపు తిప్పుకుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.






సంతోషంగా ఉంది..


హోప్ గాలా ఈవెంట్‌ గురించి ఆలియా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇలాంటి స్పెషల్ ఈవినింగ్‌ను హోస్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇందులో ప్రేమ, ప్రయోజనం, ఆశ అన్నీ ఉన్నాయి’ అంటూ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది ఆలియా. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను వసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జిగ్రా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో తను హీరోయిన్‌గా మాత్రమే కాకుండా కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 2024 సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. అంతే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’లో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఆలియా.


Also Read: మరోసారి అల్లు అర్జున్‌కు జోడీగా సమంత - ఆ తమిళ దర్శకుడి కోసమే!