Samantha Joins Allu Arjun For Atlee Film: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కొత్తగా సినిమాలు ఏమీ ఒప్పుకోవడం లేదు. మయోసైటీస్‌తో బాధపడుతూ.. దాని చికిత్స కోసమే సమయాన్ని కేటాయిస్తున్న ఈ భామ.. ఒకప్పుడు కమిట్ అయిన ప్రాజెక్ట్స్‌ను పూర్తిచేసి బ్రేక్ తీసుకుంటోంది. అయితే త్వరలోనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం కోసం సమంతను సంప్రదించారని సమాచారం. కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్‌తో కలిసి ‘ఊ అంటావా’ పాటకు స్టెప్పులేసిన సామ్.. ఇప్పుడు మరోసారి తనతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత తమిళ దర్శకుడితో చేతులు కలపనున్నాడు బన్నీ.


హ్యాట్రిక్ కాంబో..


ఎప్పటినుండో ఒక తమిళ దర్శకుడితో ఒక సినిమా చేయాలని అల్లు అర్జున్ ఆశపడుతున్నాడు. ఇంతకు ముందు ఒక కోలీవుడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఎందుకో అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఫైనల్‌గా అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో బన్నీ సరసన సమంత అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్, సమంత జంటగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో వీరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. కానీ ‘పుష్ప’లో ఊ అంటావా పాటకు వీళ్లిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు ఆడియన్స్‌లో ఉత్సాహాన్ని నింపాయి.


ప్రాజెక్ట్స్ క్యాన్సల్..


డైరెక్టర్ అట్లీకి ఒకే హీరోయిన్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే అలవాటు ఉంది. అయితే ఇప్పటికే సమంత, అట్లీ కాంబినేషన్‌లో ‘తేరీ’, ‘మెర్సాల్’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆఫ్ స్క్రీన్ కూడా సమంతకు, అట్లీకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అందుకే అల్లు అర్జున్, అట్లీ కోసం సమంత.. ఈ మూవీని చేయడానికి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. కానీ సామ్.. ఒక ప్రాజెక్ట్‌ను ఓకే చేసి చాలాకాలమే అయ్యింది. అప్పట్లో తన మయాసైటీస్ ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ ఓకే చేసిన మూడు ప్రాజెక్ట్స్‌ను కూడా సమంత క్యాన్సల్ చేసిందని వార్తలు వచ్చాయి.


ప్రస్తుతం అట్లీ ఖాళీ..


ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తయితే ప్రస్తుతం బన్నీ ఇంకా ఏ సినిమాలు కమిట్ అవ్వలేదు కాబట్టి అట్లీతోనే తన సినిమా ఉంటుందని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్‌తో చేసిన ‘జవాన్’ హిట్ తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ చేయడం కోసమే అట్లీ ఖాళీగా ఉన్నాడు. అయితే 2024 అక్టోబర్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లోని మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో దాదాపుగా సమంతనే హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తను నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రిలీజ్ కోసం సామ్ ఎదురుచూస్తోంది.


Also Read: ‘ఖుషి’ ముందే అలా - రెమ్యునరేషన్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ